టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ఆ ఇండస్ట్రీ కలిసిరాలేదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డేకు వరుస షాకులు తగులుతున్నాయి. పూజా హెగ్డే నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు అనుగుణంగా సక్సెస్ ను సొంతం చేసుకోవడం లేదు. వరుస ఫ్లాపుల వల్ల పూజా హెగ్డేకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు సైతం అంతకంతకూ తగ్గుతున్నాయి. మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక కాగా త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది.

తెలుగులో పూజా హెగ్డేకు కనీసం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉంది. తమిళంలో మాత్రం పూజా హెగ్డేకు భిన్నమైన పరిస్థితి ఎదురవుతోందని తెలుస్తోంది. తమిళంలో పూజా హెగ్డే నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. ముగముడి అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డే కెరీర్ మొదలైంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు.

కొన్నేళ్ల గ్యాప్ తర్వాత బీస్ట్ మూవీతో పూజా హెగ్డే రీఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదనే సంగతి తెలిసిందే. గతంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇలియానాకు సైతం ఇదే తరహా పరిస్థితి ఎదురైంది. కేడీ అనే సినిమాతో ఇలియానా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.

నన్భన్‌ అనే సినిమాతో ఇలియానా తమిళంలో రీఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. బీస్ట్ సినిమా డిజాస్టర్ అయినా పూజా హెగ్డేకు తమిళంలో సూర్యకు జోడీగా నటించే ఆఫర్ వచ్చిందని సమాచారం అందుతోంది. ఈ సినిమాతో పూజా హెగ్డే సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus