ఫిలిం ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ ఇమేజే వేరు.. హిట్ పడితే చాలు పారితోషికాలు వాటంతటవే పెరిగిపోతుంటాయి. ఒకస్టార్ ఒక భాషకు మాత్రమే పరిమితమైతే ఒకలా.. మిగతా భాషల్లోనూ క్రేజ్ ఉంటే మరోలా ఉంటుంది.. ఇక థియేట్రికల్ రైట్స్‌లో, బిజినెస్‌లో షేర్ లాంటివి కూడా ఉంటాయి.. కోలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోలు ఎవరెవరు ఎంతెంత పారితోషికాలు తీసుకుంటున్నారనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్:
తమిళనాడులోనే కాకుండా సౌత్ మొత్తం తెలుసు.. తెలుగులోనూ ఆయన సినిమాలకు మాంచి మార్కెట్ ఉంది.. జపాన్ వంటి విదేశాల్లోనూ రజినీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. ప్రస్తుతం ‘జైలర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న రజినీ.. అక్షరాలా రూ. 120 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట.
విశ్వనటుడు కమల్ హాసన్;
దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ‘విక్రమ్’ తో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. తెలుగు, తమిళ్‌తో ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ నటుడిగానే కాకుండా, నిర్మాతగానూ కమల్‌ని ఆదుకుంది. యూనివర్సల్ స్టార్ ఒక సినిమా రెమ్యునరేషన్ రూ.70 కోట్లు..
ఇళయ దళపతి విజయ్:
రజినీ, కమల్ తర్వాత తమిళనాట అంతటి ఆదరణ ఉన్న విజయ్.. తెలుగులోనూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ దర్శక నిర్మాతలతో ‘వరిసు’ (వారసుడు) సినిమా చేస్తున్న విజయ్ పారితోషికం 100 కోట్లు..
తల అజిత్ కుమార్:
కెరీర్ స్టార్టింగ్‌లో తెలుగులో నటించిన అజిత్ కోలీవుడ్‌లో టాప్ స్టార్.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారాయనకి. డబుల్ హ్యాట్రిక్లతో జోష్‌లో ఉన్న అజిత్ 61వ సినిమా ‘తునివు’ చేస్తున్నాడు. సినిమాకి 80 కోట్లు తీసుకుంటున్నాడు.
సూర్య:
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సూర్య సినిమాలు తమిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదలవుతుంటాయి. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జైభీమ్’ మూవీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సూర్య 50 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నారు.
చియాన్ విక్రమ్:
‘కోబ్రా’ మూవీకి 25 కోట్లు.. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ కి 12 కోట్లు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. సినిమాని బట్టి విక్రమ్ రెమ్యునరేషన్ ఉంటుందని అంటున్నారు.
ధనుష్:
నటుడిగా రెండు సార్లు, నిర్మాతగా రెండు సార్లు నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్.. ‘సార్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ధనుష్ ఒక్కో సినిమాకి 25 కోట్లు తీసుకుంటున్నాడు.
కార్తి:
అన్నయ్య సూర్య స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చిన కార్తి.. పక్కింటబ్బాయి క్యారెక్టర్లతో తమిళ్, తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. మన దగ్గర మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ‘ఊపిరి’ తో స్ట్రయిట్ తెలుగు మూవీ చేసిన కార్తి 20 కోట్లు అందుకుంటున్నాడు.
శివ కార్తికేయన్:
మిమిక్రీ ఆర్టిస్టుగా, టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, స్టార్ హీరోగా ఎదిగాడు. ధనుష్ సపోర్టుతో మంచి సినిమాలు పడడంతో నటుడిగా నిలదొక్కుకున్నాడు. ‘ప్రిన్స్’ మూవీతో టాలీవుడ్ డైరెక్టర్, ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌తో సినిమా చేశాడు. ఇందుకోసం శివ కార్తికేయన్ 25 కోట్లు పారితోషికం తీసుకున్నాడు..
విజయ్ సేతుపతి:
సౌత్‌లో వన్ ఆఫ్ ది టాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. రజినీ, కమల్ సినిమాల్లో విలన్ వేషాలు కూడా వేశాడు.. ‘సైరా’, ‘ఉప్పెన’ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ‘జవాన్’ లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి 20 కోట్లకు పైగానే ఇస్తున్నారని టాక్..