తెలుగు మార్కెట్ విషయంలో తప్పులు చేస్తున్న కోలీవుడ్ స్టార్స్.. ఏమైందంటే?

రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ వచ్చే శుక్రవారం రోజున థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు నామమాత్రపు స్థాయిలో కూడా ప్రమోషన్స్ జరగడం లేదు. ఇక్కడ ఉన్న రజనీకాంత్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాను పట్టించుకోవడం లేదు.

రజనీకాంత్ సైతం ఈ సినిమా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. జైలర్ మూవీ హిట్టైనా రజనీకాంత్ మార్కెట్ తగ్గుతుండటంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు. రజనీకాంత్ సోలో హీరోగా మాత్రమే నటించాలని గెస్ట్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవద్దని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరో స్టార్ హీరో ధనుష్ సైతం ఇవే తరహా తప్పులు చేస్తుండటం గమనార్హం.

ధనుష్ (Dhanush) గత సినిమా సార్ తెలుగులో అంచనాలను మించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్ మిల్లర్ సినిమాకు సంబంధించి సరైన ప్రమోషన్స్ జరగకపోవడంతో ఈ సినిమాకు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. కెప్టెన్ మిల్లర్ సినిమా కలెక్షన్ల విషయంలో తీవ్రస్థాయిలో ప్రేక్షకులను నిరాశపరిచింది. శివకార్తికేయన్ సైతం అయలాన్ విషయంలో చేసిన తప్పుల వల్ల ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు.

ఈ సినిమాకు ఏవైనా లీగల్ సమస్యలు ఉంటే ఆ సమస్యలను ముందుగానే పరిష్కరించుకుని ఉంటే బాగుండేది. తమిళ హీరోలు తెలుగు మార్కెట్ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ కెరీర్ ను చేతులారా నాశనం చేసుకుంటున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తమిళ హీరోలు భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ తరహా తప్పులు రిపీట్ కాకుండా ఉంటే మంచిది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus