Komma Uyyala Song: ‘ఆర్ఆర్ఆర్’.. మరో వీడియో సాంగ్ రిలీజ్ చేసిన టీమ్!

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోలు నటించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే సినిమా పెద్ద హిట్ అయింది. వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ‘కేజీఎఫ్2’ సినిమా వచ్చి ‘ఆర్ఆర్ఆర్’కి బ్రేకులేసిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే.

Click Here To Watch NOW

ఒక్కో సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ‘నాటు నాటు’ పూర్తి వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేయగా.. దానికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇక తాజాగా ‘కొమ్మ ఉయ్యాలా, కోనా జంపాలా’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మెయిన్ స్టోరీ ఈ పాటతోనే మొదలవుతుంది. ‘కొమ్మ ఉయ్యాల.. కోన జంపాల’ అంటూ ఓ చిన్నారి పాట పాడే సీన్ తో సినిమా మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది.

ఇప్పుడు ఈ పూర్తి పాటను ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఇందులో ఒకట్రెండు సీన్లు కొత్తగా కనిపిస్తున్నాయి. విజువల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్ చిన్నారి భుజాన ఎత్తుకొని రావడం ఈ పాటకు హైలైట్ గా నిలిచింది. కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ను ప్రకృతి అనే చిన్నారి పాడింది. మొన్నామధ్య సోషల్ మీడియాలో ప్రకృతిని పరిచయం చేశారు కీరవాణి.

ఈ చిన్నారి పాడిన మెలోడీ ట్యూన్ వినేకొద్దీ వినాలనిపించే మాదిరి ఉంది. దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus