కోలీవుడ్ దర్శకుడు ఆర్.జె.బాలాజీ (RJ Balaji) తన నెక్స్ట్ సినిమాని సూర్యతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కథ గతంలో రవితేజ (Ravi Teja) హీరోగా రూపొందిన ‘వీర’ (Veera) అ సినిమాకి కాపీ అని ఇటీవల ప్రచారం గట్టిగా జరిగింది. వాస్తవానికి ‘వీర’ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. రమేష్ వర్మ (Ramesh Varma) ఆ చిత్రానికి దర్శకుడు. ఆ సినిమా గురించి మాట్లాడుకోవడానికి రవితేజ ఫ్యాన్స్ కూడా ఇష్టపడరు. అలాంటి సినిమా కథని దాదాపు 14 ఏళ్ళ తర్వాత సూర్య (Suriya) చేయడం ఏంటి? అని అంతా షాక్ అయ్యారు.
అయితే గతంలో సూర్య చేసిన కథతో రవితేజ కూడా ఓ సినిమా చేశాడు. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ విషయాన్ని రైటర్ కోన వెంకట్ Kona Venkat ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేశారు. కోన వెంకట్ మాట్లాడుతూ.. “మేము ‘షాక్’ (Shock) అనే సినిమా చేశాం.రవితేజ, జ్యోతిక (Jyothika)… హీరో, హీరోయిన్స్. ఆ సినిమాలో హీరోయిన్ జ్యోతికని విలన్స్ చంపేస్తారు. అక్కడితో ఇంటర్వెల్. సెకండాఫ్..లో హీరో వాళ్లపై రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది ‘షాక్’ స్టోరీ. హీరోయిన్ చనిపోవడంతో ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోతుంది అక్కడితో..!
ఆ తర్వాత హీరో, హీరోయిన్స్ ఎలా కలుసుకున్నారు? ఎలాంటి కలలు కన్నారు అనేది.. ఆడియన్స్ కి అనవసరం. అయితే సేమ్ కథతో ‘గజిని’ సినిమా వచ్చింది. అందులో కూడా హీరో, హీరోయిన్స్ ప్రేమించుకుంటారు. హీరోయిన్ ని విలన్స్ చంపేస్తారు. ఆ తర్వాత హీరో విలన్స్ పై రివేంజ్ తీర్చుకుంటాడు. ఆ సినిమా హిట్ అయ్యింది. షాక్ ఎందుకు హిట్ అవ్వలేదు అంటే.. అది స్టోరీ టెల్లింగ్ అనే చెప్పాలి. ‘షాక్’ కథ స్ట్రైట్ గా ఉంటుంది. అందుకే ఆడియన్స్ కి ఆసక్తి కలగదు” అంటూ చెప్పుకొచ్చాడు.