Konda Polam: ‘కొండపొలం’.. నష్టాలు తప్పడం లేదు!

మెగాఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించాడు. ఈ సినిమా తరువాత అతడు క్రిష్ లాంటి దర్శకుడి చేతుల్లో పడ్డాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ‘కొండపొలం’ అనే సినిమా తెరకెక్కింది. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

యావరేజ్ టాక్ తో మొదలైనా ఈ సినిమా వీకెండ్ కి డల్ అయిపోయింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ కనీస స్థాయిలో కూడా లేవు. ఐదు కోట్ల గ్రాస్, మూడు కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇంతకుమించి కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ కనిపించడం లేదు. శని, ఆదివారాలు కూడా సినిమా సత్తా చాటలేకపోయింది. నిజానికి సినిమాను తక్కువ బడ్జెట్ లో తీసి, తక్కువే రేట్లకే అమ్మారు. కానీ బయ్యర్లకు నష్టాలు తప్పడం లేదు.

‘ఉప్పెన’, ‘కొండపొలం’ రెండు భిన్నమైన చిత్రాలు. ‘ఉప్పెన’కి వచ్చిన క్రేజ్, రిలీజ్ సమయంలో కలిసొచ్చిన అంశాలు వేరు. అయినప్పటికీ తొలి సినిమాతో రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన హీరో.. రెండో సినిమాకి రూ.5 కోట్లకు పడిపోయాడు. ప్రస్తుతం ఈ హీరో గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్నారు. అలానే మరికొన్ని సినిమాలు ఆయన లిస్ట్ లో ఉన్నాయి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus