సినిమాను ప్రచారం చేయాలంటే, అందులోనూ చిన్న పిల్లలకు కనెక్ట్ అయ్యే సినిమాలను ప్రచారం చేయాలంటే వాళ్లకు తగ్గ ఎలిమెంట్స్‌నే ఎంచుకోవాలి. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా టీమ్ అదే పనిలో ఉంది. సినిమా కోసం బొమ్మలతో ప్రచారం ప్రారంభిచింది. అంటే సినిమాలోని భైరవ పాత్రధారి బొమ్మలను సిద్ధం చేసి అమ్మకాలు ప్రారంభించారు. అయితే చైనా బొమ్మలో, ప్లాస్టిక్ బొమ్మలో కాదు.. మన ప్రైడ్ అయిన కొండపల్లి బొమ్మల్ని తయారు చేశారు. ఈ మేరకు సినిమా టీమ్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంత్రంలా సినిమా జనాలు పఠిస్తున్న పేరు ‘కల్కి’. ప్రభాస్ (Prabhas) – నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారం వేగవంతం చేశారు. అలాగే సినిమా టీమ్ ఓ వెబ్‌సైట్ లాంచ్ చేసింది. అందులో కల్కి సినిమాలోకి కీలకమమైన బుజ్జి, భైరవ, అశ్వత్థామ పాత్రల బొమ్మలు అందుబాటులో ఉంచారు. అవి కొండపల్లిలో తయారు చేసినవి కావడం గమనార్హం.
అంతేకాదు వీటిని వివిధ ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంచారు. సినిమా టీమ్ నమ్మకానికి తగ్గట్టుగా ఆ బొమ్మల్ని పిల్లలు ఇష్టంగా కొంటూ, ఆనందిస్తున్నారట. దీంతో అనుకున్న ఆలోచన సక్సెస్ అయింది నాగీ అండ్ కో సంబరపడిపోతున్నారట. నాగీ విషయంలో చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే.. ఆయన పర్యావరణ హితంగా ఉండేలా పనులు చేస్తుంటారు. ఇంత పెద్ద సినిమా తీసినా ఆయన చిన్న బ్యాటరీ కారులోనే ప్రయాణిస్తుంటారు.
అలాంటి నాగీ ఆలోచనల నుండి ఉద్భవించిన ఆలోచనే కొండపల్లి బొమ్మలు. అనుకున్నట్లే ఆయన ఆలోచనకు మంచి స్పందన వస్తోంది. ఇక సినిమా ఆలోచనకు ఎలాంటి స్పందన వస్తుంది అనేది ఈ నెల 27న తేలుతుంది. ఎందుకంటే ఆ రోజే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి. అయితే ముందు రోజు రాత్రే యూకే, యూఎస్ ప్రీమియర్లు ఉంటాయి.