Kondapolam Movie: టీవీల్లో సూపర్ హిట్ గా నిలిచిన ‘కొండపొలం’..ఫస్ట్ టైం టి.ఆర్.పి ఎంతో తెలుసా?

‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నుండీ వచ్చిన చిత్రం ‘కొండపొలం’. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కరోనా లాక్ డౌన్ టైములో తాను చదివిన ‘కొండపొలం’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు క్రిష్. తన ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌ పై జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

అక్టోబర్ 8న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించకపోయింది. రూ.8 కోట్లకి ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ జరుగగా.. కనీసం అందులో సగం అంటే రూ.4 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయింది. అయితే డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ పరంగా నిర్మాతలు లాభాలను ఆర్జించారు. క ఈ చిత్రాన్ని ఈ మధ్యనే ‘స్టార్ మా’ వారు మొదటి సారి టెలికాస్ట్ చేయగా అదిరిపోయే టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యింది.

వివరాల్లోకి వెళితే.. ‘కొండపొలం’ చిత్రాన్ని జనవరి 2న స్టార్ వారు మొదటిసారి టెలీకాస్ట్ చేశారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ‘కొండపొలం’ చిత్రం 12.34 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను రూ.5.5 కోట్లకి స్టార్ మా వారు దక్కించుకున్నారు. అయితే మొదటిసారే ఈ చిత్రం 12కి పైన టి.ఆర్.పి నమోదు చేయడంతో వారు సేఫ్ అవ్వడమే కాకుండా లాభాల బాట కూడా పట్టారని చెప్పాలి.

వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రం ‘ఉప్పెన’ కూడా స్టార్ మాలోనే టెలికాస్ట్ అవ్వగా.. మొదటిసారి ఆ చిత్రం 18కి పైగా టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. ఆ చిత్రం క్రేజే ‘కొండపొలం’ కి కలిసొచ్చినట్టు స్పష్టమవుతుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus