సుకుమార్ లాగే దర్శకుడు కొరటాల శివ కూడా తన సినిమాలకి దేవి శ్రీ ప్రసాద్ నే కంటిన్యూ చేయాలని అనుకున్నాడు. కానీ ‘మహర్షి’ తర్వాత దేవి హవా కొంచెం తగ్గింది. అదే టైంలో ‘ఇస్మార్ట్ శంకర్’ తో మణిశర్మ ఓ రేంజ్లో పైకి లేచారు. పైగా చిరుకి గతంలో మణిశర్మ ఆల్ టైం హిట్ సాంగ్స్ ఇచ్చాడు. వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు కొన్ని ఫెయిల్ అవ్వొచ్చు కానీ మ్యూజిక్ ఫెయిల్ అవ్వలేదు. అందుకే ‘ఆచార్య’ చిత్రానికి ఏరి కోరి మణిశర్మని తీసుకున్నారు చిరు.
కానీ ‘ఆచార్య’ మ్యూజిక్ సక్సెస్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా తేడా కొట్టింది. అది పక్కన పెట్టేస్తే.. ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో రూపొందుతున్న రెండో సినిమా ‘దేవర’ కి కూడా దేవిని తీసుకోలేదు. అనిరుధ్ ను తీసుకున్నారు. కానీ ఇప్పుడు అనిరుధ్ ఉన్న బిజీలో కొరటాలని పట్టించుకోవడం లేదు అని టాక్. అతను మ్యూజిక్ సిట్టింగ్స్ కి రావడం లేదట. దీంతో దేవిని తీసుకోవాలా అనే ఆలోచనలో కొరటాల ఉన్నట్టు టాక్.
మరోపక్క దర్శకుడు బుచ్చిబాబు పరిస్థితి కూడా ఇలానే ఉంది. అతను రాంచరణ్ తో చేయబోయే సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలి అనుకున్నాడు. చర్చలు జరుగుతున్నాయి. రెహమాన్ చేతిలో ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు అయితే లేవు. అలాగే అతను కొత్త సినిమాలకి పాన్ ఇండియా లెవెల్లో మ్యూజిక్ ఇచ్చేంత ఫామ్లో అయితే లేడు. అందుకే దేవి అయితేనే బెటరేమో అని బుచ్చిబాబు భావిస్తున్నట్టు సమాచారం.
‘పుష్ప ‘ తో దేవి (Devi Sri Prasad) కూడా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యాడు. ‘పుష్ప 2 ‘ సక్సెస్ తర్వాత .. కొరటాల, బుచ్చిబాబు .. దేవి గురించి బలంగా ఆలోచిస్తారేమో..!
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!