టాలీవుడ్ ఇండస్ట్రీలోని డైరెక్టర్లలో హిట్ సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్లు చాలా తక్కువమంది ఉన్నారు. రచయితగా, డైరెక్టర్ గా విజయాలను సొంతం చేసుకున్న వాళ్లలో కొరటాల శివ ఒకరు కాగా కొరటాల శివ రిటైర్‌మెంట్ వార్తలు ఆయన అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటివరకు కొరటాల శివ 4 సినిమాలను తెరకెక్కించగా ఐదో సినిమాగా ఆచార్య సినిమా తెరకెక్కుతోంది. మెగా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అయితే గతంలో కొరటాల శివ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ తాను 10 సినిమాలను తెరకెక్కించి ఆ తరువాత రిటైర్‌మెంట్ తీసుకుంటానని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ కావడానికి ముందే కొరటాల శివ 10 కథలను సిద్ధం చేసుకోగా 10 సినిమాల తరువాత డైరెక్షన్ కు గుడ్ బై చెప్పి చిన్న సినిమాలను నిర్మించి కొరటాల శివ నిర్మాతగా మారతారని తెలుస్తోంది. అయితే కొరటాల శివ రిటైర్‌మెంట్ తీసుకుంటారో లేదో తెలియాలంటే ఆయన పది సినిమాలు తెరకెక్కించే వరకు ఆగాల్సిందే.
మిర్చి సినిమాతో కొరటాల శివ ఇండస్ట్రీకి దర్శకునిగా పరిచయమయ్యారు. ఆ సినిమా తరువాత మహేష్ బాబుతో కొరటాల శివ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దర్శకుడు కాకముందు కొరటాల శివ పలు సినిమాలకు రచయితగా పని చేశారు. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తైన తరువాత కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!