మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రాలను తీసే కొరటాల శివ… సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించిన భరత్ అనే నేను పొలిటికల్ నేపథ్యంలో సాగింది. ఏ రాజకీయ నేతని విమర్శించకుండా అందరినీ ఆలోచింపచేసే విధంగా కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ వారం రోజుల్లో 161 కోట్ల గ్రాస్ వసూలు చేయడమే కాదు సినీ సెలబ్రిటీల అభినందనలు అందుకుంది. ఈ కథను ఎంచుకున్నప్పుడు అనుమానాలు తలెత్తినట్టే.. ఇందులో స్పీకర్ రోల్ కి వ్యాంప్ పాత్రలు చేసే జయలలితను కొరటాల తీసుకోవడంతో విమర్శలు వచ్చాయి. ఆ విషయంపై కొరటాల శివ తాజాగా స్పందించారు. “జయలలిత చేసిన పాత్రలను చూసి ఏదేదో ఊహించుకుంటున్నారు. నటులనే వారు అన్ని పాత్రలు చేయాలి. ఆమె కూడా అలాగే చేసింది.
జయలలిత చేసిన సినిమాలను మాత్రమే కాకుండా, కొన్ని సీరియల్స్ కూడా చూశాను. అందులో నాకు ఆమె చాలా హుందాగా కనిపించారు. ఆమె మాట్లాడే తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఆమెనే ఈ సినిమాలో స్పీకర్ పాత్ర కోసం తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఈ విషయం మహేష్ బాబుతో కూడా డిస్కస్ చేశాను. ఆయన కూడా మంచి నిర్ణయం అన్నారు. జయలలిత స్పీకర్‌గా సీట్‌లో కూర్చోగానే నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ పాత్రకు ఆమె హండ్రెడ్ పర్సంట్ సరిపోయారు అని ఇవాళ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంది’’ అని వివరించారు. కథను రాసుకోవడమే కాదు.. అందులోని పాత్రలకు తగ్గ నటులను ఎంచుకోవడంలో కొరటాల వంద శాతం సక్సస్ అయ్యారని భరత్ అనే నేను సక్సస్ చెబుతోంది.