యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి లాభాల్లో వాటాను తారక్ తన రెమ్యునరేషన్ గా తీసుకుంటారని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా కోసం కొరటాల శివ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో తారక్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనుండగా పాత్రకు తగిన విధంగా తారక్ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నారు. కొరటాల శివ తారక్ యంగ్ లుక్ లో కనిపించేలా భారీగా బరువు తగ్గాలని సూచించారని బరువు తగ్గడం కొరకు తారక్ కఠినమైన డైట్ ను ఫాలో అవుతున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం తారక్ కఠినమైన వ్యాయామాలు చేస్తున్నారని సమాచారం. కొరటాల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ బరువు తగ్గుతున్నారు.
చెమటలు చిందేలా కష్టపడుతున్న తారక్ కొత్త లుక్ లో ఏ విధంగా కనిపిస్తారో చూడాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమాకు, బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సలార్ సినిమా పూర్తైన వెంటనే ప్రశాంత్ నీల్ తారక్ సినిమా పనులతో బిజీ కానున్నారు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజయ్యేలా తారక్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వరుసగా రెండు సినిమాలలో తారక్ నటించనున్నారు. తారక్ వేగంగా సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ విషయంలో తారక్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరోవైపు తారక్ కొత్త కథలను కూడా వింటున్నారని ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు కూడా వెలువడే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!