NTR30: ఆ ఒక్క మాటతో ఎన్టీఆర్ 30 పై ఆకాశాన్నంటేలా అంచనాలు పెంచేసిన కొరటలా శివ..!

ఇండస్ట్రీ వర్గాల వారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న NTR 30 పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.. రత్నవేలు, ఎ. శ్రీకర ప్రసాద్, సాబు సిరిల్ వంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ల మీద సుధాకర్ మిక్కిిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు..

ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి జక్కన్న క్లాప్ నిచ్చారు.. ఈ సందర్భంగా కొరటాల శివ సింపుల్‌గా ఈ సినిమా స్టోరీ లైన్ చెప్పేసి అంచనాలు అమాంతం పెంచేశారు.. ‘‘ఈ కథలో మనుషుల కంటే మృగాలు ఎక్కువ వుంటారు, దేవుడు అంటే భయం లేదు.. చావు అంటే భయం లేదు.. కానీ ఒకే ఒక్కటి అంటే భయం.. ఆ భయం ఏంటో మీకు తెలిసే ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు..

అలాగే ఇప్పటివరకు తను చేసిన సినిమాల్లోకెళ్లా ఇది బెస్ట్ వర్క్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు శివ.. NTR 30 ప్రారంభ వేడుక కోసం హైదరాబాద్ వచ్చిన జాన్వీ కపూర్.. ఎన్టీఆర్‌ని ఆప్యాయంగా పలకరించింది.. ఇందుకు సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.. ఇందులో భాగంగా ఆకుపచ్చ చీరలో కనువిందు చేసిన జాన్వీ.. ఎన్టీఆర్‌తో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించింది.. ఒక్క ఫ్రేమ్‌లో ఇలా ఇద్దరూ కనిపించేసరికి అభిమానులకు రెండు కళ్లు సరిపోవట్లేదు..

ఆఫ్ స్క్రీనే ఈ పెయిర్ ఇంతా బాగుందంటే.. ఇక ఆన్ స్క్రీన్ ఇంకెంతలా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందోనని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.. మోషన్ పోస్టర్‌తోనే సినిమా నెక్స్ట్ లెవల్ అని హింట్ ఇచ్చిన టీమ్.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.. 2024 ఏప్రిల్ 5 రిలీజ్ అని అనౌన్స్ చేసేశారు.. ఎమోషనల్‌గా సాగే కథ, కథనాలు.. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా తారక్ నట విశ్వరూపం ఇందులో చూడబోతున్నారని అంటున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus