రాజమౌళి తర్వాత స్థానంలో కచ్చితంగా దర్శకుడు కొరటాల శివనే ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. వరుసగా 4 బ్లాక్ బస్టర్ లు అందుకున్న కొరటాల… తనతో పనిచేసిన ప్రతీ హీరోకి కెరీర్ బెస్ట్ ఇచ్చాడు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో రైటర్ గా పనిచేసిన కొరటాల తరువాత ‘మిర్చి’ చిత్రంతో డైరెక్టర్ గా మారాడు. లేట్ గా డైరెక్టర్ గా మారాడు కాబట్టి.. తాను సెలెక్ట్ చేసుకున్న ప్రతీ స్క్రిప్ట్ ను చాలా క్లుప్తంగా … ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా…తెరకెక్కిస్తూ ఉంటాడు.
దాదాపు 6 నెలల నుండీ 9 నెలల వ్యవధిలోనే సినిమా తీసేస్తూ ఉంటాడు. హీరో అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఏమాత్రం మిస్ చెయ్యడు. అయితే కొరటాలకు మెగాస్టార్ వల్ల 30 కోట్ల నష్టం వచ్చిందట. ప్రస్తుతం కొరటాల శివ… మెగాస్టార్ చిరంజీవి 152 వ చిత్రం ‘ఆచార్య’ ను తెరకెక్కిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. తిరిగి ప్రారంభం కావడానికి మరో 3 నెలలు అయినా పడుతుంది.
ఇదిలా ఉండగా.. కొరటాల గత చిత్రం ‘భరత్ అనే నేను’ విడుదలయ్యి రెండేళ్ళు దాటింది. అయితే ఇప్పటి వరకూ మెగాస్టార్ చిత్రం కోసమే వెయిట్ చేస్తూ వచ్చాడట. మధ్యలో రెండు సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నా… మెగాస్టార్ సినిమా కోసం వెయిట్ చేయిస్తూ వచ్చాడట. ఒక్కో సినిమాకి 15 కోట్లు పారితోషికం తీసుకుంటూ వస్తున్న కొరటాలకు.. మధ్యలో ఓ రెండు సినిమాలు చేసి ఉంటే.. 30 కోట్లు దక్కేవి. మెగాస్టార్ వల్లే మిస్ అయినట్టు తెలుస్తుంది.