మహేష్ మూవీ షూటింగ్ లో కొరటాల వార్నింగ్
- June 21, 2017 / 01:45 PM ISTByFilmy Focus
శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు 24 వ మూవీ చేస్తున్నారు. “భరత్ అను నేను” అనే టైటిల్ ఖరారు చేసిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ మహేష్ లేకుండా జరిగింది. మహేశ్ పాత్ర చిన్నప్పటి సన్నివేశాలను మాస్టర్ జాయ్ పై తీశారు. ఈరోజు నుంచి రెండో షెడ్యూల్ మొదలయింది. ఈ షూటింగ్ లో మహేష్ పాల్గొన్నారు. హైదరాబాద్ సిటీ శివార్లలో వేసిన భారీ అసెంబ్లీ సెట్ లోకి మహేష్ ముఖ్యమంత్రిగా ప్రవేశించే సన్నివేశాలను తెరకెక్కించారు. సూపర్ స్టార్ ముఖ్యమంత్రిగా ఎలా ఉండబోతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. అందుకే మహేష్ ఫోటోలను ఎవరైనా తీసి నెట్లో అప్లోడ్ చేస్తారనే భయంతో కొరటాల కండిషన్ పెట్టారంట.
సెట్ లోకి వచ్చే ఎవరైనా మొబైల్ తీసుకు రావద్దని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. కనీసం అసెంబ్లీ సెట్ ఫోటోలు తీసినా, బయటికి పంపించేస్తానని చిత్ర బృందానికి వార్నింగ్ ఇచ్చిన్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా ఎంపికైంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















