నేటి తరం హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లకు మంచి క్రేజ్ ఉంది. స్టార్ డైరక్టర్స్ వీరితో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు. దీని తర్వాత రామ్ చరణ్ తేజ్ తో మూవీ చేయాలనుకున్నారు. సంప్రదింపులు జరపడం, రెండు వైపులా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే మధ్యలో రాజమౌళి రావడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. జక్కన్న బాహుబలి తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ తో ఓ భారీ మల్టీ స్టారర్ మూవీ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ వచ్చే వేసవిలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.
సో రామ్ చరణ్ రంగస్థలం సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. ఇక కొరటాల శివకి ఎన్టీఆర్ డేట్స్ కూడా దొరకవు. అందుకని అల్లు అర్జున్ తో కలిసి వెళ్లాలని భావిస్తున్నారు. బన్నీ ఇప్పుడు వక్కంతు వంశీ డైరక్షన్లో నా పేరు సూర్య చేస్తున్నారు. ఇది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత బన్నీ ఎవరికీ కమిట్ అవ్వలేదు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దిల్ రాజు అనుకుంటున్నారు. బన్నీ కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నటు తెలిసింది. ఇది సెట్ అయితే మరో క్రేజీ కామినేషన్లో మూవీ రానుందన్నమాట.