ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఆలోచన మారిందా!

#ఎన్టీఆర్‌30… ఈ సినిమా గురించి చాలా రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ పాటికే ఈ సినిమా మొదలై.. కొన్ని షెడ్యూల్స్‌ పూర్తయిపోయి ఉండాలి కూడా. అయితే ‘ఆచార్య’ సినిమా ఫలితంతో ఇటు కొరటాల, అటు ఎన్టీఆర్‌ ఆలోచన మారిపోయింది. దీంతో సినిమా కథపై మరోసారి కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి రోజుకో మాట వినిపిస్తోంది. ఇది పక్కనపెడితే.. సినిమాలో హీరోయిన్‌ గురించి కూడా ఏవో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు హీరోయిన్‌ ఓకే అవ్వలేదు. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్‌ను ఓకే చేశారు అని అంటున్నారు.

అవునా, బాలీవుడ్‌ హీరోయిన్‌ దొరికేసిందా? ఎవరు? అని అడుగుతారా.. అయితే ఆగండాగండి. ఎందుకంటు ఇప్పుడు ఓకే అంటున్న హీరోయిన్‌ బాలీవుడ్‌ కాదు, సౌత్‌ హీరోయినే. మన ‘మహానటి’ కీర్తి సురేశ్‌ను ఈ సినిమా కోసం తీసుకున్నారని టాక్‌ వినిపిస్తోంది. నటనా ప్రాధాన్యమున్న ఈ పాత్రకు కీర్తి అయితే బాగుంటుందని కొరటాల, తారక్‌ అనుకున్నారని చెబుతున్నారు. అదేంటి గతంలో బాలీవుడ్‌.. అంటూ ప్రశ్న వేద్దాం అనుకుంటే.. మీలా ఈ ప్రశ్న వేసేవాళ్లు చాలామంది ఉన్నారు అని చెప్పాలి.

తారక్‌ – కొరటాల సినిమాలో ఆలియా భట్‌ అంటూ తొలుత వార్తలొచ్చాయి. అంతకుముందు జాన్వీ కపూర్‌ పేరు కూడా వినిపించింది అనుకోండి. ఆలియా పేరు అయితే ఎక్కువగా వినిపించింది. ఆమె కూడా ఈ సినిమా గురించి చూచాయగా చెప్పింది. ఆమె ఆ తర్వాత గర్భవతి అవ్వడంతో ఈ సినిమా నుండి దూరమైంది అన్నారు. కియారా అడ్వాణీ, పరిణీతి చోప్రా అంటూ కొన్ని పేర్లు చక్కర్లు కొట్టాయి కూడా. దీంతో పాన్‌ ఇండియా ఫీల్‌ కోసం బాలీవుడ్ నాయికను తీసుకొస్తున్నారని బలంగా నమ్మేశారు అభిమానులు.

అయితే, ఇప్పుడు కొరటాల అండ్‌ కో.. కీర్తి సురేశ్‌కు కథ చెప్పారు అనేసరికి ఇదేంటి ఇలా చేస్తున్నారు అనే ప్రశ్న వినిపిస్తోంది. మరి దీనికి కొరటాల ఏమంటారో చూడాలి. ఇక సినిమా విషయానికొస్తే.. కొర‌టాల శివ రీసెంట్‌గానే ఫైనల్ స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్‌కు చూపించి ఓకే చేసుకున్నారట. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాక‌ర్‌, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. న‌వంబర్ నుండి సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం అవుతుందని రీసెంట్‌ టాక్.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus