Koratala Siva: ఆ ప్రశ్నలను ఫేస్ చేయడానికి కొరటాల భయపడుతున్నారా?

స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన కొరటాల శివ జీవితాన్ని ఒకే ఒక సినిమా మలుపు తిప్పింది. ఆచార్య సినిమా సక్సెస్ సాధిస్తుందని అందరూ భావించగా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచి కొరటాల శివ పరువు తీసింది. చిరంజీవి, మణిశర్మ కూడా ఈ సినిమా రిజల్ట్ విషయంలో కొరటాల శివనే నిందించడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మెగా కాంపౌండ్ కు కొరటాల శివ పూర్తిస్థాయిలో దూరమైనట్టేనని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

అయితే కొరటాల శివ తనపై వ్యక్తమైన విమర్శల గురించి స్పందించడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. మీడియా వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి కొరటాల శివ భయపడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆచార్య సినిమాకు సంబంధించిన ప్రశ్నలను ఫేస్ చెయ్యడానికి కొరటాల శివ భయపడుతున్నారని ప్రచారం జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. వరుసగా నాలుగు హిట్ సినిమాలను తెరకెక్కించిన కొరటాల శివకు ఒక్క సినిమా ఫ్లాపై కెరీర్ విషయంలో ఒడిదొడుకులకు గురి చేసింది.

ఎన్టీఆర్ సినిమాతో సక్సెస్ సాధించకపోతే కొరటాల శివ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ఫలితం తేలే వరకు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడానికి కొరటాల శివ ఇష్టపడటం లేదు. ఎన్టీఆర్ కోసం సరికొత్త కథను సిద్ధం చేసిన కొరటాల శివ ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంది.

కొరటాల శివకు తారక్ నుంచి మాత్రమే అంతోఇంతో సపోర్ట్ లభిస్తోంది. తారక్ కొరటాల శివ తనకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇస్తారనే నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్ లో కొరటాల శివ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ రెగ్యులర్ షూట్ త్వరలో మొదలుకానుంది. కేవలం 5 నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని బోగట్టా.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus