Koratala Siva: దేవరపై అంచనాలు పెంచిన కొరటాల కామెంట్స్.. క్లారిటీ ఇచ్చేశాడుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కాంబోలో చాలా కాలం తర్వాత దేవర తెరకెక్కుతుండగా దేవర (Devara) ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ అవుతుందని ఎన్టీఆర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. దేవర ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దని ఆ ఆలస్యాన్ని మరిపించేలా సినిమా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా కొరటాల శివ సైతం దేవర సినిమా విషయంలో అంచనాలు పెంచేలా కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ కామెంట్స్ నిజమేనని కొరటాల శివ సైతం ధృవీకరించారు. అటు తారక్, ఇటు తన కెరీర్ లో దేవర స్పెషల్ మూవీ అవుతుందని కొరటాల శివ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కొరటాల శివ క్లారిటీతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే ఈ కాంబోలో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొరటాల శివ నెగిటివ్ సెంటిమెంట్లను బ్రేక్ చేసి ఈ దసరాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర షూట్ త్వరలో వైజాగ్ లో జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

యువసుధ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈ రెండు బ్యానర్లకు ఈ సినిమాతో భారీ హిట్ లభిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉండబోతున్నాయని భోగట్టా. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ కు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా ఒక పాత్ర చనిపోతుందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus