ఆ దర్శకుడితో హ్యాట్రిక్ ప్లాన్ చేసిన మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఎలాగైనా ఒక సినిమాతో రావాలని అనుకున్నాడు. కానీ కరోనా దెబ్బతో ప్లాన్ మొత్తం చేంజ్ అయ్యింది. ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా 2022 సంక్రాంతికు రిలీజ్ కానుంది. అయితే ఆ సినిమా అనంతరం మహేష్ బాబు ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. రాజమౌళితో అయితే ఒక సినిమా ఉంటుంది.

కానీ అంతకుముందు చిన్న గ్యాప్ లో ఒక సినిమా చేయవచ్చని తెలుస్తోంది. ఆ సంగతి పక్కనపెడితే మహేష్ బాబు హిట్టిచ్చిన దర్శకుడితో మరోసారి కలిసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు కొరటాల శివ. శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో మహేష్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిన కొరటాల ఆల్రెడీ మహేష్ కు లాక్ డౌన్ లోనే ఒక స్టోరీ లైన్ వినిపించాడట. రాజమౌళి అనంతరం ఆ కథ సెట్స్ పైకి రావచ్చని తెలుస్తోంది.

ఇక ఆ సినిమాను భరత్ అనే నేను నిర్మాత డివివి దానయ్య నిర్మించే అవకాశం ఉందట. ఈ ఏడాది ఒక్క సినిమాతోనే బిజీగా ఉండే మహేష్ వచ్చే ఏడాది మాత్రం రెండు సినిమాలతో బిజీ అవ్వనున్నట్లు టాక్.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus