Kota Srinivasa Rao, Jr NTR: తారక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు!

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బృందావనం సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. బృందావనం సినిమా కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి తాను కొన్ని సినిమాలను చేసినా బృందావనం తనకు సంతృప్తిని ఇచ్చిన సినిమా అని కోట శ్రీనివాసరావు వెల్లడించారు. బృందావనం సినిమాలోని తాత వేషాన్ని తాను మాత్రమే చేయాలని దిల్ రాజు గారు వంశీ పైడిపల్లికి చెప్పారని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.

బృందావనం సినిమా షూటింగ్ సమయంలోనే తన కొడుకు చనిపోయాడని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. బృందావనం సినిమాలో తారక్ చేసిన పాత్ర టిపికల్ పాత్ర అని భలే గమ్మత్తుగా ఉండే ఆ పాత్రలో ఎన్టీఆర్ టెంపో బాగా మెయింటెయిన్ చేశాడని కోట శ్రీనివాసరావు వెల్లడించారు. సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీహరి నటించారని అంతమంది ముందు పోటీ పడి నటించి నెగ్గుకురావడం కష్టమైనా ఎన్టీఆర్ సులువుగా ఆ పాత్ర చేశారని కోట శ్రీనివాసరావు అన్నారు.

వంశీ పైడిపల్లి తన వేషం గురించి చెప్పగానే ప్రకాష్ రాజ్ నా వేషం ఎలా వదిలేశాడు? అని అడిగానని అయితే ప్రకాష్ రాజ్ అడిగినా దిల్ రాజు ఒప్పుకోలేదని కోట శ్రీనివాసరావు వెల్లడించారు. బృందావనం క్లైమాక్స్ షూటింగ్ జరిగే సమయానికి ఎడమ కంటికి ఆపరేషన్ జరిగిందని ఒక పక్క కొడుకు పోయిన దుఃఖం, మరో పక్క కంటినొప్పి వల్ల తాను బాధ పడ్డానని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. యూనిట్ వాళ్లకు నా అవస్థ తెలుసు కాబట్టి గట్టిగా ఏమీ చెప్పలేకపోయారని వాళ్ల అవస్థను గమనించి తానే కలుగజేసుకుని సన్నివేశాలను చేశానని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus