Kota Srinivasa Rao: సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన కోట శ్రీనివాస రావు..

ఈరోజుల్లో మీడియా, సోషల్ మీడియా వల్ల ప్రపంచ నలుమూలలా ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది.. ప్రపంచమంతా తెలిసిపోతుంది.. సమాచారం కోసమో, ఇంకోదాని కోసమో అయితే పర్లేదు కానీ వీటి వల్ల మంచి కంటే కూడా చెడే ఎక్కువ స్ప్రెడ్ అవుతోంది.. కొన్ని సార్లు అవాస్తవాలు కూడా వాస్తవాలుగా ప్రచారమవుతున్నాయి.. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు కన్నుమూశారంటూ వార్తలు వైరల్ అవడంతో పరిశ్రమ వర్గాల వారు షాక్ అయ్యారు.. కట్ చేస్తే.. అవన్నీ పుకార్లేనంటూ కోట వీడియో విడుదల చేశారు..

వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం (మార్చి 21) ఉదయం విలక్షణ నటుడు కోట కన్నుమూశారంటూ సామాజిక మాధ్యమాలలో వార్తలు వచ్చాయి.. రేపటి ఉగాది పండుగ పనుల్లో ఉన్న కోటకు వరుసగా ఫోన్ కాల్స్ రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.. ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ వివరాలు కనుక్కునే ప్రయత్నం చేశారు.. ఎట్టకేలకు విషయం కోట వరకు వెళ్లింది.. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దంటూ వీడియో ద్వారా తెలియజేశారు.. తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడారు కోట..

‘‘సోషల్ మీడియాలో కోట శ్రీనివాస రావు దుర్మరణం అంటూ వార్తలు వస్తున్నాయంట.. తెల్లారితే పండుగ.. ఏం చెయ్యాలని దాని గురించి మాట్లాడుకుంటున్నాం.. ఉదయం 7, 7:30 గంటల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.. నేనే ఒక 50 కాల్స్ వరకు మాట్లాడాను.. ఇది నిజమే అనుకుని ఓ పది మంది పోలీసోళ్లు వచ్చేశారు సెక్యూరిటీ కోసం.. ఇలాంటి అవాస్తవాలను మీరే అరికట్టాలని చెప్పారు.. ఇలాంటి వార్తలు నమ్మకండి.. జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి..

మనిషి ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయకండి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కోట శ్రీనివాస రావు.. దీంతో సినీ వర్గాల వారు, సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు.. ఇలాంటి నెగిటివ్ న్యూస్ పోస్ట్ చేసే వాళ్లని, స్ప్రెడ్ చేసే వాళ్లకి తగిన బుద్ది చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus