Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు కామెంట్స్ ను ఆ టైంలో ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదా?

కంటెంట్ బాగుంటే డబ్బింగ్ సినిమాలను కూడా మన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడి స్టార్స్ ను ఇక్కడ కూడా స్టార్స్ గానే చూస్తుంటారు. తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ.. ఇక్కడ కూడా స్టార్స్ గా రాణిస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. వాళ్ళ కోసం ఇక్కడ స్టార్ హోటల్స్ లో వసతులు ఏర్పాటు చేస్తుంటారు, వాళ్ళ టీంలకి కూడా లక్షలకు లక్షలు పోస్తుంటారు, పారితోషికాలు అక్కడి కంటే 2 రెట్లు ఎక్కువగానే ఇస్తుంటారు.

Kota Srinivasa Rao

కానీ మన తెలుగు వాళ్లకి తమిళంలో కూడా అలాంటి రిసెప్షన్ ఉంటుందా? అంటే కచ్చితంగా కాదు అనే చెప్పాలి. మన సినిమాలను అక్కడి జనాలు పట్టించుకోరు. మనవాళ్ళు అక్కడి హీరోలతో సినిమాలు చేసినా ట్రోల్ చేస్తూ ఉంటారు. తమిళ సినీ పరిశ్రమ గురించి నటుడు కోటా శ్రీనివాసరావు ఎప్పుడో గొంతెత్తారు.

తెలుగు వాళ్ళను తమిళ జనాలు చాలా తక్కువ చేసి చూస్తారని, ‘సామి’ సినిమా షూటింగ్ కోసం చెన్నై వెళ్లిన రోజుల్లో తనకు కనీసం స్టార్ హోటల్లో గది కూడా ఏర్పాటు చేయలేదని, ఇచ్చిన రూమ్ అస్సలు నీట్ గా లేదని, సరైన భోజనం కూడా పెట్టలేదని వాపోయారు. కాబట్టి తమిళ నటుల్ని నెత్తిన పెట్టుకోవడం తగ్గించమని కూడా దర్శకనిర్మాతలను కోరారు కోటా శ్రీనివాసరావు.

అయినప్పటికీ మన నిర్మాతలు తమిళ నటీనటులకు ఇచ్చే ప్రిఫరెన్స్ విషయంలో ఎటువంటి మార్పు రాలేదు. పైగా కోటా శ్రీనివాసరావుకి వయసు పెరగడంతో చాదస్తం పెరిగిందని.. అందుకే అలా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. అదీ సంగతి..!

ఆ సినిమాను మించేలా మా సినిమా అనౌన్స్‌మెంట్‌..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus