Param Sundari Review in Telugu : ‘పరమ్ సుందరి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సిద్దార్థ్ మల్హోత్రా, (Hero)
  • జాన్వీ కపూర్, (Heroine)
  • రేంజి పనికర్, సిద్దార్థ శంకర్, సంజయ్ కపూర్, ఇనాయత్ వెర్మ, మంజోథ్ సింగ్ తదితరులు (Cast)
  • తుషార్ జలోటా (Director)
  • దినేష్ విజన్ (Producer)
  • సచిన్ జిగర్ (Music)
  • సంతాన కృష్ణన్ రవిచంద్రన్ (Cinematography)
  • మనీష్ ప్రధాన్ (Editor)
  • Release Date : ఆగస్టు 29, 2025
  • మడాక్ ఫిలిమ్స్ (Banner)

శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమ్ సుందరి’. తుషార్‌ జలోటా ఈ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేరళకు చెందిన అమ్మాయిగా జాన్వీ కనిపించబోతున్నట్టు టీజర్, ట్రైలర్ ద్వారా స్పష్టంచేశారు. ట్రైలర్లో ‘తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కేరళ-మలయాళం మోహన్ లాల్, ఆంధ్ర-తెలుగు అల్లు అర్జున్, కర్ణాటక-కన్నడ యష్’ అంటూ జాన్వీ పలికిన డైలాగ్ సౌత్ ఆడియన్స్ కి కూడా మంచి కిక్ ఇచ్చింది. దీంతో ‘పరమ్ సుందరి’ పై సౌత్ ప్రేక్షకులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. మరి సినిమా వారి అంచనాలకు తగ్గట్టు ఉందో లేదో తెలుసుకుందాం రండి :

Param Sundari Review in Telugu

కథ : పరమ్ సచ్ దేవ్(సిద్దార్థ్ మల్హోత్రా) పెద్ద కుటుంబానికి చెందిన కుర్రాడు. తన బిజినెస్ వ్యవహారాలు చూసుకోమని తండ్రి చెప్పినప్పటికీ.. సొంతంగా ఎదగాలని భావిస్తాడు. ఈ క్రమంలో స్టార్టప్స్ వంటివి పెట్టి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అతనికి సక్సెస్ లభించదు. ఈ క్రమంలో శేఖర్ (అభిషేక్ బెనర్జీ) పరమ్ కి ‘ఫైండ్ మై సోల్ మేట్’ అనే యాప్ గురించి చెబుతాడు. దాని ద్వారా ‘సోల్ మేట్’ ని వెతుక్కోవచ్చని చెబుతాడు. ఆ యాప్ పై రీసెర్చ్ చేసిన పరమ్ కి.. దానికి ఇంకా పెట్టుబడి పెట్టాలని అనిపిస్తుంది. దీంతో అతని తండ్రిని రూ.5 కోట్లు అడిగితే ‘నీ పై ఇప్పటికే చాలా ఇన్వెస్ట్ చేశాను. ముందు నీ సోల్ మేట్ ను కనుక్కో… తర్వాత ఇన్వెస్ట్ చేస్తాను’ అని చెబుతాడు. వెంటనే ఆ యాప్ ను ట్రై చేసిన పరమ్ కి కేరళ లో ఉన్న సుందరి దామోదరమ్ పిళ్ళై ప్రొఫైల్ కనిపిస్తుంది. వెంటనే అతను కేరళ వెళ్ళిపోతాడు. అక్కడ ఆమె ఆచూకీ కనిపెట్టి ఆమెకు దగ్గరవుతాడు. ఆ తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : జాన్వీ కపూర్ ఎప్పటిలానే తన మార్క్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. కాకపోతే ఎక్కువ శాతం కేరళ అమ్మాయిలు ఈమెతో పోలిస్తే కొంచెం కలర్ తక్కువగా ఉంటారు. జాన్వీ మాత్రం అర్బన్ ఫేస్ కట్ తో ఉంటుంది. అయితే శారీస్ తో మేనేజ్ చేసే ప్రయత్నం చేసింది. ఈమెతో పలికించిన మలయాళం డైలాగులు బాగానే సింక్ అయ్యాయి. ఇక సిద్దార్థ్ మల్హోత్రా గ్లామర్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది. ఈ సినిమాలో కూడా చాలా అందంగా కనిపించాడు. కాస్ట్యూమ్స్ కూడా బాగా సెట్ అయ్యాయి. సిద్దార్థ్ శంకర్ పాత్ర సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇస్తుంది. తన వరకు బాగానే చేశాడు. రెంజి పానికర్,,మన్ జోత్ సింగ్ పాత్రలు కొంచెం ఇరిటేట్ చేస్తాయి. ఇనాయత్ వర్మ ఓకె అనిపిస్తుంది.


సాంకేతిక నిపుణుల పనితీరు : తుషార్ జలోటా తీసుకున్న పాయింట్ సౌత్ జనాలకు ఏమాత్రం కొత్తగా అనిపించదు. కొన్ని వందల సినిమాల్లో చూసిన లవ్ ట్రాక్ నే అటు తిప్పి ఇటు తిప్పి తీశాడు. ఆ మాటకు వస్తే ఇది నార్త్ ఆడియన్స్ ని కూడా అలరించే అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడి జనాలు కూడా ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ వంటి సినిమాలు చూశారు. ‘పరమ్ సుందరి’ కథ దాదాపు ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ లానే ఉంటుంది. వాస్తవానికి చెన్నై ఎక్స్ ప్రెస్ కూడా కొత్త కథేమీ కాదు. కానీ అందులో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ఆడియన్స్ రిపీటెడ్ ఆ సినిమాని చూసి బ్లాక్ బస్టర్ చేయడానికి అది మెయిన్ రీజన్ గా చెప్పుకోవాలి. కానీ ‘పరమ్ సుందరి’ లో కామెడీ కూడా చాలా వీక్. ఉన్న కామెడీ కూడా చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. ప్రతి సీన్ ను ముందుగానే ప్రేక్షకుడు అంచనా వేసేలా ఉంటుంది. డైరెక్షన్, రైటింగ్ ఎంత వీక్ గా ఉన్నాయో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు వేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. అయితే కథ, కథనాలు అలరించే విధంగా లేనప్పుడు ఎన్ని మెరుపులు ఉన్నా ప్రేక్షకుడు కన్విన్స్ అవుతాడు అనడానికి లేదు. రన్ టైం 2 గంటల 16 నిమిషాలే ఉన్నా.. అది కూడా భారంగానే అనిపిస్తుంది.


విశ్లేషణ : ఫైనల్ గా ‘పరమ్ సుందరి’ లో జాన్వీ -సిద్దార్థ్..ల పెయిర్ బాగున్నప్పటికీ.. సరైన కథ, కథనాలు లేకపోవడం వల్ల వాళ్ళ కష్టం కూడా వృధా అయిపోయింది అని చెప్పాలి. ఎంతో ఓపిక ఉంటే తప్ప ఈ సినిమాని థియేటర్లలో చివరి వరకు చూడటం కష్టమే.

రేటింగ్ : 1.5/5

 ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus