Krishna: కృష్ణ కూతురు ఎమోషనల్ పోస్ట్.. లవ్ యూ నాన్నా అంటూ?

ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతి అనే సంగతి తెలిసిందే. తండ్రిని గుర్తు చేసుకుంటూ మంజుల ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మంజుల ఆ పోస్ట్ లో నాన్నా మీరు మమ్మల్ని వదిలి అప్పుడే ఏడాది అవుతోందని అన్నారు. మిమ్మల్ని ఇప్పటికీ ప్రతిక్షణం మిస్ అవుతూనే ఉన్నామని చెప్పుకొచ్చారు. మీరు ఉన్న ఇంట్లోనే ఉంటున్నామని ప్రతిసారి మీరు పక్కనే ఉన్నట్టు అనిపిస్తోందని ఆమె కామెంట్లు చేశారు.

మీరు షూటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చేవారని మీ సినిమాల 100 రోజుల వేడుకకు వెళ్లినా అవుట్ డోర్ షూటింగ్ లకు వెళ్లినా వెంటనే ఇంటికి వచ్చేసి మాతో కలిసిపోయేవారని మంజుల పేర్కొన్నారు. ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అన్ని బాధ్యతలను నిర్వర్తించారని ఆమె చెప్పుకొచ్చారు. మీరు ఎక్కడ ఉన్నా మీ మనస్సు ఇంటిమీద, కుటుంబ సభ్యుల మీద ఉందని మంజుల కామెంట్లు చేశారు.

నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మీరేనని మీ వృత్తిలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని మంజుల అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే మీరు వ్యక్తిగత జీవితంలో వాటికి మించిన అద్భుతాలు చేశారనే విషయం ప్రపంచానికి తెలియదని ఆమె వెల్లడించారు. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని అన్నారు. మరోవైపు నమ్రత (Krishna) కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

నమ్రత శిరోద్కర్ ఇప్పటికే ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు స్కాలర్ షిప్స్ ఇవ్వాలని నమ్రత నిర్ణయం తీసుకున్నారు. నమ్రత తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. మహేష్ నమ్రత కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. నమ్రతను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus