Krishna Vamsi: ‘రంగమార్తాండ’ టైటిల్ పోస్టర్ పై కృష్ణవంశీ క్లారిటీ..!

చాలా గ్యాప్ తర్వాత ‘రంగమార్తాండ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ ఈ చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. అందుకే ఈ చిత్రం గురించి నిత్యం ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం పెద్ద క్యాస్టింగ్ నే ఎంపిక చేసుకున్నాడు కృష్ణవంశీ. ప్రకాష్ రాజ్, అనసూయ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

వారంతా ప్రస్తుతం తమ పాత్రలకు డబ్బింగ్ చెబుతున్నారు. మరాఠి లో నానా పాటేకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నటసామ్రాట్’కు రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ మూవీ. నానా పాటేకర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్టు ఇటీవల కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటివరకు చేయలేదు. అతను ఎందుకు చేయలేకపోయారు అనే విషయానికి కారణం చెబుతూ తన ఫేస్బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

‘లక్ష్మణ్ అనే ఆర్టిస్ట్ ఎన్నో టైటిల్ లోగోలను డిజైన్ చేసి తన ముందు పెట్టాడట. ఇవి అన్నీ అద్భుతంగా అనిపిస్తున్నాయి అని. ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం కష్టంగా ఉందని. 4 రోజులుగా తర్జనభర్జన పడుతున్నట్టు కృష్ణవంశీ తెలిపాడు. ఈ పది లోగో డిజైన్ లలో ఒకటి సెలెక్ట్ చేయాలని కూడా అతను కోరుతున్నట్టు కనిపిస్తుంది. ఆ లోగో డిజైన్ లను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus