Krishna Vamsi, Anasuya: అనసూయ పై కృష్ణవంశీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

కృష్ణవంశీ దర్శకత్వంలో కొంచెం గ్యాప్ తర్వాత రాబోతున్న చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ ‘నటసామ్రాట్’ అనే మలయాళం మూవీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయినా సరే అందులో సోల్ ను మాత్రమే తీసుకుని దర్శకుడు కృష్ణవంశీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఉగాది కానుకగా మార్చ్ 22న అంటే రేపు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్లో భాగంగా ఈరోజు మీడియాతో ముచ్చటించింది ‘రంగమార్తాండ’ టీం.

ఈ సినిమాలో అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. దీంతో దర్శకుడు కృష్ణవంశీ ఇచ్చిన స్పీచ్ లో.. ఆమె గురించి కూడా ప్రస్తావించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు. కృష్ణవంశీ అనసూయ గురించి మాట్లాడుతూ.. “ఒక స్పైసీగా ఉండి, ఎడ్యుకేటెడ్ అయ్యుండి, ఒక క్లాస్ అయ్యుండి, ఒక ఆరా ఉన్న అమ్మాయి.. కోడలి పాత్రకు కావాలి, ఆ అమ్మాయి మీద మనకి కోపం రాకూడదు, మనం ఆ అమ్మాయిని లవ్ చేయాలి, కానీ అదే టైంలో తను చేయగలగాలి, అలాంటి ఒక నైఫ్ ఎడ్జ్ క్యారెక్టర్ అని నేను చెప్పాను.

అప్పుడు ‘పుష్ప’ క్యాస్టింగ్ డైరెక్టర్ ఈ పాత్రకు అనసూయ అయితే బాగుంటుంది అని చెప్పాడు. కానీ ఆ అమ్మాయి చేస్తుందా? మనం భరించగలమా.! ‘అసలే అరుస్తుంటుంది. ఫోన్లు పగలగొడుతుంటుంది రోడ్ల మీద ‘ అని అన్నాను. అందుకు అతను ట్రై చేద్దాం సార్.. ఆమె నో అంటే మానేద్దాం అన్నాడు. సరే అని ఫోన్ చేస్తే .. పది నిమిషాల్లో ఆఫీస్ కు వచ్చేసింది.

సరే నీ రోల్ ఇది అని చెబుతుంటే.. మీరేం చెప్పొద్దు నేను చేస్తాను అంది అనసూయ. సో నైస్ ఆఫ్ యు” అంటూ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం కృష్ణవంశీ కామెంట్లు వైరల్ గా మారాయి. గతంలో అనసూయ రోడ్డు పై ఫోన్ పగలగొట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus