Krishna Vamsi: కృష్ణవంశీ చెప్పినట్లే జరుగుతుందా..?

ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ సినిమాలను రూపొందించిన దర్శకుడు కృష్ణవంశీ ఈ మధ్యకాలంలో ఒక్క హిట్టు కూడా లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆయన తెరకెక్కించిన ‘నక్షత్రం’ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకొని ‘రంగమార్తాండ’ సినిమాను పట్టాలెక్కించాడు. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ లాంటి తారలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ మొదలై రెండేళ్లు దాటేసింది. కానీ ఇప్పటివరకు సినిమా విడుదల కాలేదు.

ఆర్ధిక సమస్యల కారణంగా మధ్యలో కొన్ని రోజులు షూటింగ్ ఆపేశారు. ఆ తరువాత కోవిడ్ ఎఫెక్ట్ పడింది. ఇలా సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఏదొక సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ సినిమాపై సరైన బజ్ కూడా లేదు. దీంతో సినిమా ఇక రిలీజ్ కాదేమో అనుకున్నారు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ నేరుగా కృష్ణవంశీను ప్రశ్నించాడు. ట్విట్టర్ లో కృష్ణవంశీని ట్యాగ్ చేస్తూ ‘రంగమార్తాండ’ ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడగగా..

ఈ ఏడాది డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని కృష్ణవంశీ వెల్లడించారు. వచ్చే నెలలో సినిమా ప్రమోషన్స్ మొదలుపెడతామని చెప్పారు. మరాఠీలో హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus