ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన కృష్ణవంశీ ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రంగమార్తాండ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని కృష్ణవంశీ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆగష్టు నెలలో రంగమార్తాండ థియేటర్లలో విడుదల కానుంది. మరాఠీ మూవీ నటసామ్రాట్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా గురించి కృష్ణవంశీ మాట్లాడుతూ మొదట ప్రకాష్ రాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకున్నారని తెలిపారు.
ఆ తర్వాత ప్రకాష్ రాజ్ నాకోసం డైరెక్ట్ చెయ్యి అని అడగగా ఈ సినిమాకు దర్శకత్వం వహించానని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. రంగమార్తాండ మన పేరెంట్స్ కథ అని పేరెంట్స్ కు విలువ ఇస్తున్నామా లేక గౌరవించి తప్పుకుంటున్నామా అనే విషయాలను ఈ సినిమాలో చర్చించామని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. అందరిలో అధికుడిని అనిపించుకోవాలని మనల్ని మనం కోల్పోతున్నామని రంగమార్తాండ సినిమాలో ఇదే విషయాన్ని చూపించామని కృష్ణవంశీ పేర్కొన్నారు. రంగ మార్తాండ స్టేజ్ యాక్టర్ కథ అని నేను హిట్ కోసం ఎప్పుడూ సినిమా తీయలేదని ఆయన అన్నారు.
హిట్ కోసం తీయాలంటే మార్కెట్ లో ఉన్న హిట్ ఫార్ములాను వాడాలని ఆయన తెలిపారు. ఎవ్వరూ హిట్ సినిమాలు తీయలేరని తీసిన సినిమాలు హిట్ అవుతాయి అంతేనని ఆయన చెప్పుకొచ్చారు. ఫ్లాప్స్ వల్లే గ్యాప్ వచ్చిందని సక్సెస్ దక్కితేనే ఇండస్ట్రీలో ఫాస్ట్ గా ఉంటామని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తానని ఇప్పుడే చెప్పలేను కానీ ఆ సినిమా బ్లాస్ట్ అని కృష్ణవంశీ అన్నారు.
ఓటీటీలో క్రియేటివ్ ఫీడమ్ ఉందని 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఓటీటీ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తానని ఆయన తెలిపారు. ఓటీటీ ప్రాజెక్ట్ ను స్వచ్చంగా చేయవచ్చని స్టార్స్ ఉండాలన్న నిబంధనను పాటించాల్సిన అవసరం లేదని కృష్ణవంశీ తెలిపారు. కృష్ణవంశీ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!