Krishna Vrinda Vihari Trailer : మంచి ఫన్ ఫిల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఉంది..!

నాగశౌర్య హీరోగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ‘ఐరా క్రియేషన్స్’ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఉషా ముల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఆల్రెడీ ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి మార్కులే పడ్డాయి. అలాగే లిరికల్ సాంగ్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది.

ప్రమోషన్లో భాగంగా ఈరోజు ట్రైలర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కృష్ణ (నాగ శౌర్య) అనే అబ్బాయి.. అగ్రహారంలో నివసిస్తూ ఉంటాడు. అయితే MNC కంపెనీలో ఉద్యోగం రావడంతో సిటీకి వస్తాడు. అక్కడ అతను ఓ అందమైన అమ్మాయి బృందా (షెర్లీ సెటియా)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఇతన్ని ప్రేమించేలా చేయడానికి అతను ఎన్నో అమాయకపు పనులు చేస్తుంటాడు. ఆ రూపంలో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దక్కుతుందని ట్రైలర్ ద్వారా తెలియజేశారు.

సనాతన కుటుంబానికి చెందిన హీరో ఆధునిక విధానంలో తనకు నచ్చినట్టు జీవించే అమ్మాయి… వీళ్ళు ప్రేమించుకున్నప్పటికీ పెళ్లి చేసుకోవడానికి వీళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారా? మరీ ముఖ్యంగా కృష్ణ ఫ్యామిలీ ఒప్పుకుందా? అనే ప్రశ్నలు లేవనెత్తుతూనే.., ఒప్పించే ప్రాసెస్ లో హీరో అండ్ గ్యాంగ్ చేసే ఫన్ కూడా ఆకట్టుకుంటుంది అని ట్రైలర్ హింట్ ఇచ్చింది.

రాధిక శరత్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ వంటి వారి కామెడీ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంది. నాగ శౌర్య కూడా తన మార్క్ కామెడీ టైమింగ్ తో అలరించేలా ఉన్నాడు. ఓవరాల్ గా ట్రైలర్ ఫన్ ఫిల్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ తో పాస్ మార్కులు వేయించుకుంటుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!


భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus