రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు సెప్టెంబర్ 11న మరణించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ వచ్చిన ఆయన ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన చిన కార్యక్రమం రోజున హైదరాబాద్ లో, అలాగే పెద కార్యక్రమం రోజున ఆయన సొంత ఊరు అయిన మొగల్తూరులో భారీగా భోజనాల ఏర్పాట్లు చేశారు. మొగల్తూరులో అయితే లక్షల కొద్దీ జనాలు హాజరయ్యారు. వారికి కడుపు నిండా పెట్టి పంపించారు. మొత్తంగా 50 రకాల నాన్ వెజ్ వెరైటీలు చేయించి ఆ జనాభాని తృప్తిపరచి పంపించారు.
కృష్ణంరాజు గారు కానీ, ప్రభాస్ కానీ తమ వద్దకు వచ్చిన మీడియా మిత్రులకు అలాగే సినీ ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులకు అదే విధంగా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారని ఇండస్ట్రీ సభ్యులు అంతా చెప్పుకుంటూ ఉంటారు. కృష్ణంరాజు గారు ఇలా లవ్ ఫీస్ట్ ఇవ్వడం వెనుక ఓ చిన్న కథ కూడా ఉంది. ఆయన కెరీర్ ప్రారంభంలో జర్నలిస్ట్ గా పనిచేసేవారు. అటు తర్వాత నటుడిగా మారి చిన్న చిన్న పాత్రలు చేయడం మొదలుపెట్టారు.
తర్వాత విలన్ గా కూడా చేశారు.అయితే సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో ప్రొడక్షన్ హౌస్ లకు వెళ్లడానికి ఆయన చెన్నై రోడ్లపై తెగ తిరిగేవారు. అయితే ఒకసారి కృష్ణంరాజు వద్ద డబ్బులు అయిపోయాయి. వాళ్ళది రాజవంశ కుటుంబం. డబ్బులకు ఇబ్బంది లేదు. కానీ సినిమాల్లో అవకాశాల కోసం తిరగడం ఎందుకు ఇంటికి వచ్చేయమని వాళ్ళ ఇంట్లో ఒత్తిడి ఉండేదట. దాంతో ఆయన ఇంట్లో డబ్బులు అడిగేవారు కాదు. కొన్ని రోజులు ఒకపూట మాత్రమే తినేవారు. డబ్బులు అయిపోయాక ఆయనకు సాయంత్రం వరకు తినడానికి ఏమీ లేదు.
దీంతో 8 కిలోమీటర్లు నడుచుకుంటూ చెన్నైలో ఉంటున్న తన స్నేహితుడి వద్దకు వెళ్లి డబ్బులు అప్పుగా అడిగారట. అందుకు అతని స్నేహితుడు కృష్ణంరాజు మొహమాటాన్ని గుర్తించి భోజనం పెట్టి మరీ డబ్బులు ఇచ్చాడట. అందుకే కృష్ణంరాజు గారు తమని కలవడానికి ఎవరొచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి కానీ పంపేవారు కాదు అని తెలుస్తుంది.అదే అలవాటు ప్రభాస్ కు కూడా వచ్చింది. అందుకే ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి అతనితో పనిచేసిన సినీ సెలబ్రిటీలు అందరూ గొప్పగా చెబుతుంటారు.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!