ప్రభాస్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు.. ఆసక్తికరమైన విషయాలు తెలిపిన కృష్ణంరాజు..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా కెరీర్ ను ప్రారంభించిన ప్రభాస్ ఈరోజున పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు కృష్ణంరాజు స్టార్ గా ఏమీ లేరు. అప్పటికే ఆయన ఫేడౌట్ అయిపోయారు. సో బ్యాక్ గ్రౌండ్ బలమైనది ఏమీ కాదు.. కానీ అతని సంకల్పం, అభిమానుల సంకల్పం బలమైనది. అదే ప్రభాస్ ను ఈరోజు పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది.ప్రభాస్ హీరోగా పరిచయం అయ్యి అంటే హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా నేటితో అంటే జూన్ 28తో 20 ఏళ్ళు పూర్తయ్యింది.

2002వ సంవత్సరంలో జులై 28 న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ ‘ఈశ్వర్’ అనే సినిమాని మొదలుపెట్టారు. ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి నేటికి 20 ఏళ్ళు పూర్తికావస్తున్న తరుణంలో ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జె ఎస్ ఆర్ శాస్త్రి ( గుంటూరు ) ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైద్రాబాద్ లో కృష్ణం రాజు ఇంట్లో కొద్దిపాటి సెలెబ్రేషన్స్ జరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభాస్ అభిమానులతో పాటు ఈశ్వర్ సినిమాను తెరకెక్కించి, ప్రభాస్ ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కృష్ణంరాజు మాట్లాడుతూ .. “ప్రభాస్ హీరోగా పరిచయం అయ్యి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయిందా అన్న సందేహం కలుగుతుంది. నిజానికి ప్రభాస్ ని మా గోపి కృష్ణ బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం చేద్దామని అనుకున్నాం.

అయితే ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు. ‘ఈశ్వర్’ కథ చెప్పినప్పుడు … మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ, తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందని అనిపించింది. ఆ నమ్మకంతో అశోక్ కుమార్ కు ఓకే చెప్పాము. జయంత్, అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది.

పైగా ఆ సినిమాలో అశోక్ కుమార్ చెడ్డ తండ్రి పాత్రలో నటించడం ఇంకా గొప్ప విషయం. నిర్మాతే ఆ సినిమాలో విలన్ గా నటించడం అనే బాగా రిస్క్. అయన గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ప్రభాస్ మొదటి సినిమా చూసాకా తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడు అని ఏనాడూ ఊహించలేదు” అంటూ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus