రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న ఏఐజీ హాస్పిటల్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయన సొంత ఊరు మొగల్తూరులో సంస్మరణ సభ ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లక్షల్లో జనాలు హాజరయ్యారు. ప్రభాస్, కృష్ణంరాజు అభిమానులతో పాటు చుట్టుపక్కనున్న ఊర్లల్లో ఉన్న జనాలు.. కొందరు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇలా ఎంతో మంది హాజరయ్యారు. కృష్ణంరాజు గారు బ్రతికున్న రోజుల్లో ఆయన వద్దకు సామాన్యులు వచ్చినా, సెలబ్రిటీలు వచ్చినా మంచి ఆతిథ్యం ఇచ్చి, కడుపునిండా భోజనం పెట్టి పంపేవారు.
కాబట్టి ఆయన జ్ఞాపకార్ధం … మొగల్తూరు జరిగిన సభకు వచ్చిన అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపాలని నిర్ణయం తీసుకున్నాడు ప్రభాస్. ఈ క్రమంలో 50 రకాల వంటకాలతో విందును ఏర్పాటు చేశాడు. ఒక్క వంటకాలు అనే కాకుండా, కృష్ణంరాజు చనిపోయిన రోజు నుండి అక్కడ పనిచేసే వారికి, సచివాలయాల్లో పనిచేసేవారికి సంస్మరణ సభ రోజు వరకు భోజనాలు పెట్టారట. అంతేకాకుండా భద్రతా సిబ్బందికి.. ఆ వేడుక ఏర్పాట్లకు ఇలా మొత్తం కలుపుకొని ప్రభాస్ రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశారు అని సమాచారం.
కృష్ణంరాజు, ప్రభాస్ లది రాజవంశ కుటుంబం. వారు ఎక్కడ ఏ వేడుక చేసినా ఘనంగా ఉంటుంది. అలాగే ఎవరికైనా పెట్టడంలో కూడా వీరిది పెద్ద చేయి. అందుకే కృష్ణంరాజు సంస్మరణ సభ ఇంత ఘనంగా చేశారు. ఒక పది కాలాల పాటు గుర్తుండి పోయేలా కృష్ణంరాజు గారి సంస్మరణ సభ జరిగింది అక్కడి స్థానికులు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక మరికొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ప్రభాస్ తిరిగి తన సినిమాల షూటింగ్లలో పాల్గొంటారు అని తెలుస్తుంది.
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!