Krishnam Raju: కృష్ణంరాజుకి చిన్న ప్రమాదం.. సర్జెరీ చేసిన వైద్య నిపుణులు..!

సీనియర్ స్టార్ హీరో, ప్రముఖ నటుడు, నిర్మాత అయిన కృష్ణంరాజు గారు చిన్న ప్రమాదానికి గురయ్యారు. దాంతో ఆయనకి సర్జెరీ జరిగింది. పూర్తివివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో ఉన్న ఆయన సొంత ఇంట్లో కృష్ణంరాజు గారు కాలు జారిపడ్డారట. దాంతో ఆయన కాలుకి గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. చిన్నపాటి ఆపరేషన్ పడుతుంది అని వైద్య నిపుణులు తెలిపారట. వారు చెప్పినట్టుగానే కృష్ణంరాజు గారికి సర్జెరీ చేశారు.

అందులో భాగంగా ఆయన కాలు వేలుని కూడా తొలగించినట్టు సమాచారం. సర్జెరీ పూర్తవ్వడంతో కృష్ణంరాజుని డిశ్చార్జ్ కూడా చేసేసారట. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. కృష్ణంరాజు.. ప్రభాస్ తో కలిసి నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం ఈ శుక్రవారం అంటే మార్చి 11న విడుదల కాబోతుంది.కృష్ణంరాజు గారి బ్యానర్ అయిన ‘గోపికృష్ణా మూవీస్’ సమర్పణలో ఈ మూవీ రూపొందింది.

ఈ చిత్రంలో విక్రమాదిత్య(ప్రభాస్) గురువు పరమహంస పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. ఆయన లుక్ కూడా ప్రేక్షకుల్ని అలరించింది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus