ఓ కొత్త హీరోయిన్ ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్ అవ్వాలంటే.. ఆమె చేసిన తొలి సినిమాలోని పాత్ర చాలా బలంగా ఉండాలి. దానికి కుర్రకారు గుండెల్ని మెలి తిప్పే అందం కూడా ఉండాలి. అలాంటి అన్ని కాన్సెప్ట్‌లు ఉన్న కథానాయిక కృతి శెట్టి. ఆ సినిమా తర్వాత రెండు హిట్లు వచ్చినా.. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్‌లు వచ్చాయి. దీంతో ఆమె హిట్ ట్రాక్ తప్పింది అంటున్నారు కొందరు పరిశీలకులు. అయితే ఈ క్రమంలో కృతి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్‌గా మారాయి.
‘‘నేను ఏ సినిమా చేసినా నా పాత్ర గురించి ముందే నోట్స్ సిద్ధం చేసి పెట్టుకుంటాను. దాని వల్ల ఆ పాత్రను చేయడం చాలా సులువుగా ఉంటుంది. సెట్‌లో ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు నిజంగానే.. ఆ సన్నివేశం నా జీవితంలో జరుగుతుంది అని అనుకునే చేస్తాను. అలా చేయడం వల్లే నా నటన సహజంగా ఉంటుందని నమ్ముతాను’’ అని అంటోంది కృతి శెట్టి. వైవిధ్యమైన పాత్రలు చేసినప్పుడే ప్రేక్షకుల నుండి మెప్పు పొందగలను అని చెప్పింది.
‘‘ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ వేటికవే భిన్నం. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి పాత్ర దక్కడం నా అదృష్టం’’ అని చెప్పిన కృతి… సినిమాల కోసమే సైకాలజీ చదువుతున్నా అని అంటోంది. సినిమాలో పాత్రల్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది సైకాలజీ ద్వారా తెలుస్తుందని.. నటనలో అది తనకు హెల్ప్ అవుతుందని ఆ కోర్స్ చేస్తోందట. కమర్షియల్ నాయికగా అలరిస్తూనే.. నటనా ప్రాధాన్యమున్న పాత్రలతోనూ సత్తా చాటాలనుంది. ఈ విషయంలో శ్రీదేవి నాకు స్ఫూర్తి అని చెప్పింది కృతి.
శ్రీదేవి కమర్షియల్ హీరోయిన్ పాత్రలకు ఎంత బాగా సెట్ అయ్యేవారో.. నటనా ప్రాధాన్యమున్న పాత్రలతోనూ అంతగానే మెప్పించారు. ఆమెలా పేరు తెచ్చుకోవాలనేదే నా ఆలోచన. ఇక సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం నాగచైతన్యతో వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది కృతి. సూర్యతో తొలి తమిళ సినిమా చేస్తోంది.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!