Krithi Shetty: విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో బేబమ్మ.. ఫోటోలు వైరల్!

ఉప్పెన సినిమా ద్వారా బేబమ్మగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు వచ్చాయి అనంతరం కృతి శెట్టి నటించిన తదుపరి రెండు సినిమాలు కూడా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా అవకాశాలు వచ్చాయి. కృతి శెట్టి నటించిన నాలుగవ సినిమా నుంచి తదుపరి సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గానే నిలిచాయి.

ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్లాప్ సినిమాలను చవిచూడటంతో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు కానీ తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం బేబమ్మకు అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి. ఇక ఈమె నటించిన సినిమాలు తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇకపోతే తాజాగా మరో డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ అందుకున్నారని తెలుస్తోంది..ప్రముఖ నటి నయనతార భర్త విగ్నేష్ శివన్ కొత్త సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు లవ్ టుడే హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాధన్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు

ప్రస్తుతం ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు విగ్నేష్ దర్శకుడు కావడం విశేషం. ఈ సినిమాలో SJ సూర్య, యోగి బాబు కూడా నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో మరియు రౌడీ పిక్చర్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా టైటిల్ చూస్తుంటే సినిమా మొత్తం కామెడీ నేపథ్యంలోనే కొనసాగుతుందని స్పష్టంగా అర్థం అవుతుంది. మరి ఈ స్టార్ డైరెక్టర్ అయిన కృతి శెట్టికి (Krithi Shetty) హిట్ అందించేనా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus