టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన కృతిశెట్టి ఉప్పెన సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఉప్పెన సినిమా కృతిశెట్టి రేంజ్ ను పెంచడంతో పాటు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరగడానికి కూడా కారణమైందనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత కృతిశెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు సక్సెస్ సాధించినా మరీ బ్లాక్ బస్టర్ హిట్లు కాదు. అయితే ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల ఫలితాలతో కృతిశెట్టికి భారీ షాకులు తగిలాయి.
ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ కావడంతో పాటు కృతిశెట్టి ఇమేజ్ కు డ్యామేజ్ చేశాయి. అయితే కృతిశెట్టి చేతిలో ప్రస్తుతం రెండు ఆఫర్లు ఉన్నాయి. నాగచైతన్య సినిమాతో పాటు సూర్య సినిమాలో కూడా కృతిశెట్టి నటిస్తుండటం గమనార్హం. ఈ రెండు సినిమాలు విడుదలైతే మాత్రమే కృతిశెట్టి కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలలో కనీసం ఒక సినిమా సక్సెస్ సాధించినా కృతిశెట్టి కెరీర్ కు మేలు జరుగుతుంది.
కృతిశెట్టి కథల ఎంపికపై దృష్టి పెట్టాలని మరి కొందరు సూచిస్తున్నారు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకోని పక్షంలో కృతిశెట్టి సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి ఎంతో సమయం పట్టదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కృతిశెట్టి ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. వరుస ఫ్లాపుల నేపథ్యంలో కృతిశెట్టి రెమ్యునరేషన్ తగ్గే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కృతిశెట్టి కచ్చితంగా సక్సెస్ సాధించే ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రమే ఆమె కెరీర్ కు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. కెరీర్ విషయంలో కృతిశెట్టి ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. కృతిశెట్టి సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే ఆమె కెరీర్ ప్రమాదంలో పడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.