Krithi Shetty: గొప్ప మనసు చాటుకున్న యంగ్ హీరోయిన్!

మన సెలబ్రిటీల్లో చాలా మంది ఛారిటీ వర్క్ చేస్తుంటారు. కొంతమంది సొంతంగా ఎన్జీవోలు కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో యంగ్ హీరోయిన్ కృతిశెట్టి చేరింది. తన పుట్టినరోజు సందర్భంగా కృతిశెట్టి కీలక నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో ఉన్న పేదవారికి సాయం చేయడానికి ఓ స్వచ్చంద సంస్థను మొదలుపెట్టింది. ‘నిష్న – ఫీడ్ ది నీడ్’అనే పేరుతో ఎన్జీవోను మొదలుపెట్టింది. తన తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ సంస్థను నెలకొల్పినట్లు వెల్లడించింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏడాది అవుతున్న సందర్భంగా ఎన్నో విషయాలను వెల్లడించింది కృతిశెట్టి. తన కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా వెల్లడించింది. కష్టాల్లో ఉన్నవారికి ఏదైనా సాయం చేయాలనే ఆలోచనలో ఎన్జీవోను స్టార్ట్ చేసినట్లు తెలిపింది. అందరూ తమ సంస్థకు అండగా నిలవాలని కోరింది. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

వారికి స్పెషల్ థాంక్స్ చెప్పింది కృతి. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరింది. ఇక కృతి మొదలుపెట్టిన ఎన్జీవో ద్వారా.. పేదలకు అవసరమైన నిత్యవ‌స‌ర స‌రుకులు, దుస్తులు, ప‌రిశుభ్ర‌త సామ‌గ్రి అందించనున్నట్లు తెలిపింది. ఇబ్బందుల్లో ఉన్న పేదవారు తమను సంప్రదిస్తే.. తోచినంత సాయం చేస్తానని వెల్లడించింది. కృతి తీసుకున్న నిర్ణయం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులో పెద్ద బాధ్యత చేపట్టిందంటూ ఆమెని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతి.. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటుంది. రీసెంట్ గా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకుంటుంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus