హిట్ కోసం మరీ ఇంత రెచ్చిపోవాలా!!!

టాలీవుడ్ లో బోణీ సినిమాతో తెరంగేట్రం చేసి, ఆతరువాత పవన్ కల్యాణ్ తో తీన్మార్ సినిమాలో ఆడిపాడిన అందాల భామా కృతి కర్బందా గుర్తుందా….ఈ భామ తన లక్ అంతా సౌత్ లోనే ఉంది ఎన్నో సినిమాలు ట్రై చేసినప్పటికీ అవేమి పెద్దగా కలసి రాకపోవడంతో తెలుగు అయిపోయి, తెమిళ్ లోకి అడుగు పెట్టింది. అయితే అక్కడ పెద్దగా ఈవిన్ని పట్టించుకున్న వారు లేరు. ఇక చేసేది ఏమీ లేక బాలీవుడ్ కి చెక్కెసింది ఈ భామ, అయితే వరుసగా ఆఫర్స్ అయితే వస్తున్నాయి కానీ, హిట్స్ పడకపోవడంతో ఇప్పుడు తాను ఇమ్రాన్ హష్మితో చేస్తున్న రాజ్ రిబూట్ లో రెచ్చిపోయిన ధాకలాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికీ విడుదలయిన ఈ ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం ఆమె మీదే నడుస్తున్నట్టు ఉంది. హర్రర్ నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమాలో కృతి ఓ పక్క అభినయంతో ఆకట్టుకుంటూనే మరో పక్క ఇమ్రాన్ తో ముద్దుల వర్షం కురిపించింది. ఓ హీరోయిన్స్ కు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ పర్ఫెక్ట్ గా ఉన్నా ఎందుకో అమ్మడు సరైన క్రేజ్ సంపాదించుకోలేకపోవడంతో ఇక చేసేది ఏమీ లేక ముద్దుల్లో ముంచేసేందుకు రెడీ అయినట్లు కనిపిస్తుంది.

సౌత్ లో ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్ బాలీవుడ్లో ఒక్క సినిమాతో సంపాదించుకునే ఉద్దేశంతో కృతి ఇలా చేస్తుంది అని ఇట్టే అర్ధం అయిపోతుంది. ఇక సీనియర్ కిస్సర్ ఇమ్రాన్ తో లిప్ లాక్ చేస్తే ఆ హీరోయిన్ దశ తిరిగినట్టే. మరి చూస్తుంటే అన్ని పరిణామాలు కృతికి ఈసారి కలిసి వచ్చేలానే ఉన్నాయి. కృతి లాంటి బ్యూటీకి బాలీవుడ్లో సక్సెస్ అయితే ఇక తిరుగు ఉండదు. చూద్దాం మరి ఈ అవకాశం ఈ బ్యూటీకి ఎంతవరకూ కలసి వస్తుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus