Kriti Sanon, Prabhas: డేట్‌ చెప్పే ముందు నేనే చెప్పేస్తున్నా.. ఇదీ సంగతి: కృతి

ఉరుము ఉరిమి మంగళం మీద పడటం అంటే మీకు తెలుసా? తెలిస్తే ఓకే.. లేకపోతే ఓ సారి కృతి సనన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ చూడండి మీకే అర్థమైపోతుంది. ప్రభాస్‌తో కృతి సనన్‌ రిలేషన్స్‌ గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏదో విధంగా, ఎవరో ఒకరు ఆ ఇద్దరి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వాటిపై కృతి స్పందించింది. అసలు విషయం చెప్పాల్సిన ఆమె చెప్పకుండా.. మీడియా మీద పడి ఏడవటం లాంటి చిన్న చిన్న పనులు చేసింది.

గత కొద్ది రోజులుగా ప్రభాస్‌ – కృతి సనన్‌ గురించి పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. తొలుత ‘ప్రభాస్‌ అంటే.. పెళ్లి చేసుకోవడానికి సిద్ధం’ అని కృతి చెప్పగా.. ఆ తర్వాత ఓ టీవీ షోలో కృతి కో స్టార్‌ వరుణ్‌ ధావన్‌ ఏకంగా ‘ప్రభాస్‌ మనసులో కృతి ఉంది’ అంటూ కామెంట్‌ చేశాడు. అయితే ప్రభాస్‌ పేరు నేరుగా చెప్పకపోయినా.. ‘ముంబయిలో లేడు, దీపికతో నటిస్తున్నాడు’ అంటూ ఏవేవో చెప్పుకొచ్చి హింట్‌ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై కృతి స్పందించింది.

అర్ధరాత్రి సమయంలో కృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘భేడియా’ సినిమా ప్రచారం అనుకున్నదాని కంటే కాస్త వైల్డ్‌గా సాగింది. దీంతో ఏవేవో విషయాలు చర్చకు వచ్చాయి. అవి బయటకు రూమర్లుగా మారిపోయాయి. ఈ క్రమంలో ఏదో ఒక వెబ్‌సైట్‌ వాళ్లు నా పెళ్లి డేట్‌ను కూడా అనౌన్స్‌ చేసే లోపు.. నేనే చెప్పేస్తాను. ప్రభాస్‌కు, నాకు మధ్య వస్తున్న పుకార్లు నిజం కాదు.

అదంతా బేస్‌లెస్‌ అని క్లారిటీ ఇచ్చింది కృతి. అయితే ఇక్కడే ఓ విషయం ఆమె చెప్పలేదు. అదే ఆ పుకార్లకు కారణమైంది ఒకటి ఆమె, రెండోది వరుణ్‌ ధావన్‌. వాళ్లు అంటేనే రాశారు తప్ప.. కొత్తగా ఎవరూ ఏమీ క్రియేట్‌ చేయలేదు. సో.. అదీ సంగతి. ఇద్దరి మధ్య ఏమీ లేదట.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus