Kriti Sanon: కృతి సనన్ కొత్త ఇల్లు ఎన్ని కోట్లంటే?

కృతి సనన్ నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇటీవలే ఆమె మిమీలో తన నటనకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఇది కాకుండా, ఆమె నటించిన గణపత్ చిత్రం కూడా గత శుక్రవారం (అక్టోబర్ 20) విడుదలైంది. ఇక ఆమెకు ఆ సినిమా అంతగా కలిసి రాలేదు అనుకోండి అది వేరే విషయం. హిట్లు లేకున్నా ఆమె ముంబైలో కొత్త అపార్ట్‌మెంట్ కోసం వెతుకుతున్నట్లు చాలా కాలంగా సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి.

ఇప్పుడు తాజా సంచలనం ఏమిటంటే, కృతి (Kriti Sanon) తన కోసం బాంద్రాలో కొత్త ఇంటిని కొనుగోలు చేసిందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని నటి ఇంకా ధృవీకరించలేదు. ఇటీవల నటి బాంద్రాలోని తన కొత్త అపార్ట్‌మెంట్ వెలుపల కనిపించింది. మీడియా నివేదికల ప్రకారం, కృతి భవనంలో 4-BHK అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని విలువ ₹35 కోట్లు ఉంటుందని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా ఇదే భవనంలో నివసిస్తున్నారు.

కృతి నటించిన గణపత్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమెతో పాటు టైగర్ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఆమె పవర్‌ఫుల్ యాక్షన్‌ రోల్లో కనిపించింది. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus