సినిమా ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఇప్పుడిప్పుడే మహిళలు అన్ని రంగాల్లో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలా మంది హీరోలు, కాస్త పేరున్న నటులు తమ పాత్రల కంటే హీరోయిన్ పాత్రలకు పరిధి, ప్రాముఖ్యత ఉన్నప్పుడు నటించడానికి ఆసక్తి చూపరని ఓపెన్ గా చెప్పేసింది ఓ హీరోయిన్. ఆమె మరెవరో కాదు.. కృతిసనన్. తెలుగులో ‘1 నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత ‘దోచేయ్’ అనే మరో సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో కృతి బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ ఆమెకి అవకాశాలు రావడంతో పాటు నటిగా మంచి పేరు కూడా తెచ్చుకుంది. దీంతో బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారింది. లేటెస్ట్ గా కృతిసనన్ నటించిన సినిమా ‘బచ్చన్ పాండే’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించింది కృతి. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
హీరోలకు సమానంగా హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత ఉండడం లేదని ఆమె పేర్కొన్నారు. సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు 60 శాతం ప్రాముఖ్యత ఉండి, హీరో పాత్రలకు 40 శాతం ఉండేలా ఉంటే.. అందులో కాస్త పేరున్న నటులు ఎవరూ నటించడానికి ఆసక్తి చూపించరని కృతిసనన్ చెప్పుకొచ్చింది. ఇప్పటికే కంగనా రనౌత్, తాప్సీ లాంటి నటీమణులు ఈ విషయంపై చాలా సార్లు మాట్లాడారు. ఇప్పుడు కృతిసనన్ కూడా ఈ లిస్ట్ లో చేరింది.
ఇదిలా ఉండగా.. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమాలో కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దీంతో పాటు ‘షెహజాద’, ‘బేడియా’, ‘గణ్‌పత్’ వంటి చిత్రాల్లో నటించింది కృతిసనన్.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!