తెలుగులో మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించిన కృతిసనన్ ఆ తరువాత ‘దోచేయ్’ సినిమాలో కనిపించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వకపోవడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు అక్కడ చాలా బిజీ అయిపోయింది కృతి. ప్రభాస్ తో కలిసి ‘ఆదిపురుష్’ అనే సినిమాలో కనిపించనుంది. ఇందులో ఆమె సీత పాత్ర పోషించనుంది. ‘ఆదిపురుష్’ కంటే ముందు ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కృతి ప్రేక్షకులను పలకరించబోతుంది.
అదే ‘మిమీ’. సైలెంట్ గా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేశారు. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైనర్ ఎంతో ఫన్నీగా ఉంది. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోన్న ఈ ట్రైలర్ కి మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇందులో ఒక విదేశీ జంట కోసం సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి సిద్ధమయ్యే మధ్య తరగతి అమ్మాయిగా కృతి కనిపిస్తోంది. ట్రైలర్ లో చూస్తే స్లిమ్ గా ఉండే కృతి కాస్త బొద్దుగా కనిపిస్తోంది.
ప్రెగ్నెంట్ అయినప్పుడు అమ్మాయిలు బరువు పెరిగి బొద్దుగా తయారవుతారనే సంగతి తెలిసిందే. అందుకే కృతి ఈ పాత్ర కోసం బరువు పెరిగింది. మొత్తం పదిహేను కిలోల బరువు పెరిగింది. సాధారణంగా హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేస్తుందని మహా అయితే ఐదారు కేజీలు పెరుగుతారేమో కానీ మరీ పదిహేను కిలోలు పెరగాలంటే నో చెప్పేస్తారు. కానీ కృతి మాత్రం ధైర్యంగా ముందుకొచ్చింది. మరి ఈ పాత్ర కోసం ఇంతకష్టపడ్డ కృతికి ఫలితం దక్కుతుందేమో చూద్దాం!