Kriti Shetty: ఫేక్ న్యూస్ పై స్పందించి క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి!

ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనంతరం వరుస సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇలా పలు సినిమా అవకాశాలు అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె గురించి గత కొద్దిరోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో కుమారుడు కృతి శెట్టిని తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేస్తున్నారనీ ఓ వార్త వైరల్ గా మారింది.

ఆమె ఎక్కడికి వెళ్ళినా తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని ఇలా ఆ స్టార్ హీరో కొడుకు వేధింపులను ఈమె భరించలేకపోతున్నారు అంటూ కృతి శెట్టి గురించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇలా తన గురించి వస్తున్నటువంటి వార్తలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇకపోతే ఈ వార్తలు రోజు రోజుకు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న నేపథ్యంలో వీటికి పులి స్టాప్ పెట్టారు. ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ గత కొంతకాలంగా నా గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.

ఇలాంటి తప్పుడు వార్తలను నేను నమ్మను కానీ రోజురోజుకు ఈ వార్తలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటిని అసలు నమ్మకండి అంటూ ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ విధంగా స్టార్ కొడుకు వేదింపుల వార్తలపై స్పందించి ఈమె క్లారిటీ ఇవ్వడంతో అదంతా ఫేక్ అని క్లారిటీ వచ్చేసింది.ఇక కృతి శెట్టి సినిమాల విషయానికొస్తే ఈమె (Kriti Shetty) తాజాగా నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే ఈమె మాత్రం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus