ఆడియన్స్ కి కిక్ ఇచ్చే సినిమా అంట..!

కార్తీక్ మేడికొండ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా క్షణ క్షణం. ఈ సినిమా పోస్టర్ ని రీసంట్ గా డైరెక్టర్ మారుతి లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రతి సీన్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని, పేరు తగ్గట్లుగానే సినిమా ఉండబోతోందని ఈ సందర్భంగా మారుతి చెప్పాడు. అయితే, ఇప్పుడు ఈసినిమాపై సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్ అందరూ. అయితే, సెర్చింగ్ లో మాత్రం రామ్ గోపాల్ వర్మ క్షణక్షణం సినిమానే వస్తోందట.

అయినా కూడా క్షణక్షణం 2021 అంటూ సెర్చ్ చేస్తున్నారు అందరూ. ఇంతలా ఈ సినిమాలో ఏముందా అని ఆరాతీస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఉదయ్‌ శంకర్‌, జియా శర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి రోషన్ సాలుర్ మ్యూజిక్ ని అందించారు. ఇప్పటి వరకూ చేసిన సాంగ్స్ చాలా బాగా వచ్చాయని టాక్. మ్యూజికల్ గా యూత్ కి బాగా కనక్ట్ అయ్యేలాగా కనిపిస్తోంది. అలాగే, ఈ సినిమా స్టోరీ ప్రేక్షకులని ఉత్కంఠానికి గురి చేస్తుందట. మంచి కథా బలమున్న స్క్రిప్ట్‌ ఇది.

ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని చెప్తేంది మూవీ టీమ్. టైటిల్ కి తగ్గట్లుగానే చాలా కొత్తగా పోస్టర్ ని డిజైన్ చేశారు. సినిమాలో ప్రతి క్యారెక్టర్ చాలా సహజంగా ఉంటుందని, ప్రతి సీన్ కూడా ప్రేక్షకులని ఎక్కడా రిలాక్స్ అవ్వనివ్వదని అంటన్నాడు డైరెక్టర్ కార్తీక్ మేడికొండ. ఈ సినిమాకి డాక్టర్ వర్లు, మన్నం చంద్రమౌళి లు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అదీ విషయం

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus