Samantha,KTR: సమంత ఇన్ స్టాగ్రామ్ లో కేటీఆర్ ఫోటో.. ఏమైందంటే?

చాలామంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫోటోలను, ఇతర విషయాలను పంచుకుంటూ ఉంటారని అభిమానులు భావిస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే ఆయా ప్రముఖుల తరపున పీఆర్ టీమ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంటారు. కొంతమంది సెలబ్రిటీలకు కామన్ గా ఒకే పీఆర్ ఏజెన్సీ ఉంటుంది. ఈ విషయాలను వెల్లడించడానికి సెలబ్రిటీలు ఇష్టపడరు. అయితే తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో కేటీఆర్ ఫోటో ప్రత్యక్షమైంది.

ఫోటోతో పాటు ఆ పోస్ట్ లో కేటీఆర్ “నా ప్రజలే నా బలం నా ధైర్యం నా నమ్మకం!” అని వెల్లడించినట్లు ఉంది. అయితే మొదట సమంత అభిమానులకు సమంత ఈ పోస్ట్ ఎందుకు చేసిందో అర్థం కాలేదు. అయితే కొన్ని నిమిషాల తర్వాత సమంత ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ పోస్ట్ మాయమైంది. ఆ తర్వాత కొంతమంది నెటిజన్లకు క్లారిటీ వచ్చింది. పీఆర్ ఏజెన్సీ కేటీఆర్ సోషల్ మీడియా అకౌంట్ లో చేయాల్సిన పోస్ట్ ను అందుకు బదులుగా సమంత అకౌంట్ నుంచి పోస్ట్ చేసింది.

కొన్ని నిమిషాల తర్వాత ఏజెన్సీ నిర్వాహకులు తప్పును గుర్తించి సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఇలా జరగడం వల్ల కేటీఆర్, సమంత పీఆర్ టీమ్ ఒకటేనని నెటిజన్లకు క్లారిటీ వచ్చింది. సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలలో నటిస్తున్నారు. అయితే సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం, యశోద సినిమాలపై ఆశించిన స్థాయిలో అంచనాలు ఏర్పడలేదు.

ఈ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. భారీ బడ్జెట్లతో సమంత సినిమాలు తెరకెక్కుతుండగా ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతాయో లేదో చూడాలి. ప్రస్తుతం థియేటర్లలో పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతుండటం గమనార్హం.

1

2

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus