Devara: ‘దేవర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో రద్దు… ఎవరూ ఊహించని వ్యక్తే కారణమట.!

ఆరేళ్ల తర్వాత తారక్‌ (Jr NTR) సోలో హీరోగా వస్తున్న సినిమా అంటూ.. ‘దేవర’(Devara) గురించి అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇదిగో, అదిగో అంటూ సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ క్రమంలో ప్రచారం మొదలయ్యేసరికి తెలుగు ప్రచారం తగ్గింది అనే రూమర్లు వచ్చాయి. తీరా తెలుగు ప్రచారం స్టార్ట్‌ చేయగానే.. ప్రీరిలీజ్‌ ఈవెంట్ రద్దయింది. దీనికి కారణమేంటి అని అడిగితే.. ఒక్కొక్కరూ ఒక్కో వాదన చెబుతుంటారు. అయితే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా ఇటీవల స్పందించారు.

Devara

ఈవెంట్‌ రద్దయిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై సెటైర్లు వేశారాయన. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం ‘దేవర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం కూడా చేతకాలేదని ఎద్దేవా చేశారు. తమ హయాంలో హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు ఘనంగా జరిగేవి అని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌.. ఇక్కడ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని నిర్వహించ లేని పరిస్థితుల్లోకి ఈ రోజు నగరం వెళ్లిపోయింది అని కేటీఆర్‌ కామెంట్‌ చేశారు.

ఆయన మాటలు ఇలా ఉంటే సోషల్‌ మీడియాలో ఈ విషయంలో ఒక్కో రకం వాదనలు వినిపిస్తున్నాయి. ఐదు వేల మందికి మాత్రమే అవకాశం ఉన్న ఆ వేదికకు మూడింతల మందికి పాసులు ఇచ్చారనే వాదనలు ఉన్నాయి. అసలు ఈవెంట్‌ నిర్వహించే మూడ్‌లోనే టీమ్‌ లేదనే విమర్శలూ ఉన్నాయి. ఇక ‘దేవర’ సినిమా సంగతి చూస్తే.. తారక్‌ – కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఇది.

రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగంగా ఈ నెల 275 వస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఈ రోజు ప్రఖ్యాత బియాండ్‌ ఫెస్ట్‌లో సినిమా స్పెషల్‌ ప్రీమియర్‌ ఉంది. మన దగ్గర అయితే అర్ధరాత్రి 1 గంట నుండి షోస్‌ వేస్తున్నారు.

స్పెషల్‌ వీడియో రెడీ చేస్తున్న సుకుమార్‌ టీమ్‌.. ఫ్యాన్స్‌కు గూస్‌ బంప్స్‌..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus