Kushi: పవన్ పాత సినిమా వల్ల నిఖిల్ సినిమా ఫలితం తారుమారైపోయిందా?

నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన రెండో చిత్రం ’18 పేజెస్’. వీరి కాంబినేషన్లో అంతకు ముందు వచ్చిన ‘కార్తికేయ2′ చిత్రం పాన్ ఇండియా వైడ్ సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీ అసాధారణమైన కలెక్షన్లు సాధించి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ.135 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది ఈ చిత్రం. అయితే గతేడాది చివర్లో వీరి కాంబినేషన్లో వచ్చిన ’18 పేజెస్’ చిత్రం ‘కార్తికేయ2’ స్థాయి విజయాన్ని నమోదు చేయలేకపోయింది.

డిసెంబర్ 23న రిలీజ్ అయిన ’18 పేజెస్’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి వారం డీసెంట్ కలెక్షన్స్ ను సాధించింది. రూ.13 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ 11 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.9.73 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ‘ధమాకా’ ‘అవతార్ 2’ వంటి చిత్రాల బాక్సాఫీస్ జోరు నడుమ ఈ మూవీ నిలదొక్కుకుంది. కానీ డిసెంబర్ 31న రీ రిలీజ్ అయిన ‘ఖుషి’ మూవీ వల్ల ’18 పేజెస్’ కలెక్షన్లు దెబ్బ తిన్నట్టు స్పష్టమవుతుంది.

పవన్ కళ్యాణ్ కెరీర్లో క్లాసిక్ గా నిలిచిన ‘ఖుషి’ మూవీ.. రీ రిలీజ్ అయినప్పటికీ రూ.6 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది. ఒకవేళ ‘ఖుషి’ చిత్రం రీ రిలీజ్ కాకుంటే.. ఆ కలెక్షన్స్ కచ్చితంగా ’18 పేజెస్’ కు వచ్చేవి. అప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ సాధించేది.

ఇప్పుడైతే ’18 పేజెస్’ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్నట్టు అయ్యింది. ఈ వీకెండ్ వరకు ఛాన్స్ ఉన్నా.. మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమా కూడా రీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ’18 పేజెస్’ నిలబడకపోవచ్చు అనే చెప్పాలి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?<

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus