విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ఖుషి మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ మొదలయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఖుషి మూవీ అదుర్స్ అనిపిస్తోంది. బుకింగ్స్ మొదలైన కొన్ని గంటల్లోనే బుక్ మై షో వెబ్ సైట్ లో ప్రముఖ థియేటర్లలో సోల్డ్ ఔట్ అని కనిపిస్తుండటం గమనార్హం. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఖుషి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజవుతుండగా అన్ని భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మెజారిటీ థియేటర్లలో ఉదయం 8 గంటల నుంచి ఖుషి షోలు ప్రారంభమవుతున్నాయి. విజయ్, సమంత ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఖుషి ట్రైలర్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించింది.
ఖుషి సినిమా (Kushi Movie) కథకు సంబంధించి కొన్ని రూమర్లు ప్రచారంలోకి రాగా దర్శకుడు శివ నిర్వాణ ఆ రూమర్ల గురించి క్లారిటీ ఇచ్చారు. ఖుషి సినిమా సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో పాటు రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. ఖుషి సినిమా కథ కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. అసలు కథకు సంబంధించిన విషయాలను ట్రైలర్ లో రివీల్ చేయలేదని సమాచారం అందుతోంది.
ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం కూడా ఖుషి మూవీకి ఒకింత ప్లస్ కానుంది. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు భారీ రేంజ్ లో ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, సమంత ఈ సినిమా ష్యూర్ షాట్ హిట్ అని ఫీలవుతున్నారు. ఖుషి సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు రావడం గమనార్హం. ఈ సినిమాతో నిన్నుకోరి, మజిలీ సినిమాలను మించిన సక్సెస్ దక్కుతుందని శివ నిర్వాణ ఫీలవుతున్నారు.
https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!