L2 Empuraan Collections: సూపర్ హిట్ సినిమా.. ఇక్కడ మాత్రం ప్లాప్..!

2019 లో మలయాళంలో రూపొందిన ‘లూసిఫర్’ సినిమా అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా తెలుగులో డబ్ అయినప్పటికీ రీమేక్ చేశారు. దానికి మంచి టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఇక ‘లూసిఫర్’ కి సీక్వెల్ గా ‘ఎల్ 2 – ఎంపురాన్’ (L2: Empuraan) రూపొందింది. మార్చి 27న ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి నెగిటివ్ రెస్పాన్స్ ను మూటగట్టుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)  దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు (Dil Raju)  రిలీజ్ చేశారు. దీంతో ఎక్కువ థియేటర్లు దక్కాయి.

L2 Empuraan Collections:

కానీ నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ వల్ల తెలుగులో మంచి వసూళ్లు రాలేదు. మరోపక్క సినిమాలో చూపించిన మత కలహాల ఎపిసోడ్ కూడా వివాదాస్పదమైంది. అందువల్ల చాలా సీన్లు డిలీట్ చేశారు మేకర్స్. అది కూడా కలెక్షన్స్ తగ్గడానికి కారణమైంది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.98 కోట్లు
సీడెడ్ 0.26 కోట్లు
ఆంధ్ర(టోటల్) 0.57 కోట్లు
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.81 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్ (తెలుగు వెర్షన్)
0.20 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 2.01 కోట్లు(షేర్)

‘ఎల్ 2 – ఎంపురాన్’ (L2 Empuraan) సినిమాకు రూ.5.3 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం ఈ సినిమా కేవలం రూ.2.01 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.3.59 కోట్ల షేర్ ను రాబట్టాలి. గ్రాస్ పరంగా కేవలం రూ.3.26 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మలయాళంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. తెలుగులో అయితే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ కనిపించడం లేదు.

మంచి టాక్ వచ్చినా.. క్యాష్ చేసుకోలేదు!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus